Telugu

2017 బిగ్గెస్ట్ “మల్టీస్టారర్” జోక్!

తెలుగు సినీ ప్రేక్షకులు భారీ మల్టీస్టారర్ సినిమాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూడడం… వాటిని ఎన్ క్యాష్ చేసుకునే విధంగా క్రేజీ హీరోల కాంబోలతో పుకార్లు పుట్టుకురావడం అనేది గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న విషయం. ఇలా ఎన్ని పుకార్లు వచ్చినా… ఏదొకటి అయినా నిజం కాకపోతుందా అని నమ్మడం… ఆశతో నిరీక్షిస్తున్న తెలుగు సినీ అభిమానుల వంతవుతోంది. 2017వ సంవత్సరం కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. ఈ ఏడాదిలో కూడా భారీ మల్టీస్టారర్ పేర్లు తెరపైకి వచ్చాయి.

ADVERTISEMENT

మహేష్ బాబు – పవన్ కళ్యాణ్, మహేష్ – బాలకృష్ణ, పవన్ – చిరంజీవి… ఇలా ఒకటేమిటి చాలా క్రేజీ కాంబోలే వినిపించాయి. అయితే అన్నింటిలోకల్లా “జోక్” అయిన కాంబో ఏమిటంటే… మెగాస్టార్ చిరంజీవి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంభినేషన్ లో సినిమాపై అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ, చివరికి అది “జోక్”గానే మిగిలిపోవడం విశేషం. త్రివిక్రమ్ దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి నటించేందుకు ఒప్పుకున్నారని, దీనిని తాను నిర్మించబోతున్నానని తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి పలు దఫాలుగా చేసిన ప్రకటనపై ఆయనకు ఏమాత్రం నమ్మకముందో గానీ, ఒక్క అభిమాని కూడా విశ్వసించలేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మిగిలిన కాంభినేషన్లు కేవలం రెగ్యులర్ పుకార్లలో భాగంగా వినిపించగా, చిరు – పవన్ ల సినిమాకు సంబంధించి మాత్రం దాదాపుగా అయిదారు సార్లు మీడియా ముఖంగా చెప్పినప్పటికీ, ఫైనల్ గా అది “జోక్”గానే మారిపోయింది. అయితే ఇది ఇంత జోక్ గా మారిపోవడానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ఓ పక్కన చిరు, పవన్ లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని, కధ రెడీ చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నారని సుబ్బిరామిరెడ్డి చెప్పగా, అసలు ఇలాంటి ప్రతిపాదన ఏది తన వద్దకు రాలేదని పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టగా, తమ్ముడితో కలిసి నటించడానికి కధ కావాలి కదా అంటూ చిరు చెప్పడంతో… ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాదికే “బిగ్గెస్ట్ జోక్”గా మారిపోయింది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Anand, Vijay, Rashmika: Deverakonda Family Battle Begins

The last quarter of 2026 is turning into an interesting period for the Deverakonda family.…

16 minutes ago

ఇచ్చట అన్ని చేదు నిజాలే చెప్పబడును: కవిత

భారత్‌ని ఎవరు దోచుకున్నారు?సమాధానం: బ్రిటిష్ వాళ్ళు. మరి ఇప్పుడు ఎవరు దోచుకుంటున్నారు. ఈ ఒక్కటీ అడగొద్దు. సరే! తెలంగాణని ఎవరు…

38 minutes ago