
దాని గురించి ఒక వివరణ వచ్చింది. “నేను స్థితి గురించి తిరిగి తెలుసుకోవడానికి కాజల్ అగర్వాల్‌తో మాట్లాడాను. ఈ వార్తల్లో నిజం లేదు. ఆమె ఆచార్య చేస్తుంది. ఈ వార్తా నివేదికలు నిరాధారమైనవి” అని నటి మేనేజర్ స్పష్టం చేశారు. ఖైదీ నెం 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కాజల్ రెండో సారి కలిసి నటిస్తుంది.
క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా చూపుతూ త్రిష్ణ తప్పుకున్న తర్వాత ఆమెను ఈ ప్రాజెక్టులోకి తీసుకువచ్చారు. ఆచార్య షూటింగ్ 40% పూర్తి అయ్యింది. మొదట్లో ఆగస్టు 14న విడుదల చెయ్యాలి అనుకున్నా ఇప్పుడు సంక్రాంతి కి విడుదల అవకాశాలను పరిశీలిస్తున్నారు. అయితే అది ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి రాకపోతేనే.
ఆచార్యలో చిరంజీవి ఒక మాజీ నక్సలైటుగా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఎండోమెంట్స్ విభాగంలో అవినీతికి సంబంధించిన సబ్జెక్టు గురించని సమాచారం. చాలా ఏళ్ల తరువాత మణి శర్మ చిరంజీవితో కలిసి ఈ చిత్రంలో పనిచేస్తున్నారు. గతంలో వారిద్దరూ సెన్సషనల్ ఆల్బమ్స్ ఇచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ శ్రేణులు చాలా ధైర్యంగా పోరాడుతున్నారనే జగన్ మాట పై ఎటువంటి సందేహమూ లేదు. ప్రతిపక్షంలోకి…
The TDP-Jana Sena alliance has witnessed unexpected developments in candidate selection for the Andhra Pradesh…