Telugu

త్రివిక్రమ్ ను మరోసారి తక్కువ చేసిన నాగార్జున

మొన్న జరిగిన కింగ్ నాగార్జున మన్మథుడు 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున స్పీచ్ కొంత మేర వివాదాస్పదం అవుతుంది. అలాగే పలు అనుమానాలకు కూడా తావిస్తోంది. నాగార్జున మాట్లాడుతూ మన్మథుడు దర్శకుడు విజయభాస్కర్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. అయితే ఆ సినిమాకు కథ, కథనం, మాటలు అందించిన త్రివిక్రమ్ గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిజానికి మన్మథుడు అనే సినిమా త్రివిక్రమ్ సినిమా గానే చాలా మంది చూస్తారు.

అలాంటిది త్రివిక్రమ్ గురించి మాట్లాడలేదు అంటే… నాగార్జునకు ఆయనకు ఎక్కడో చెడింది అనే గుసగుసలు వినిపించాయి. కొందరు నాగార్జున అఖిల్ తో ఒక సినిమా తీయమని త్రివిక్రమ్ ను పలుసార్లు అడిగాడని, అయితే త్రివిక్రమ్ దానికి ఒప్పుకోలేదని, అఖిల్ వరుస పరాజయాలకు త్రివిక్రమ్ కూడా ఒక కారణమని నాగార్జున అనుకుంటున్నాడని, అందుకే ఆ దర్శకుడి మీద ఆగ్రహం తో ఉన్నారని అభిప్రాయపడ్డారు. కొందరు మాత్రం నాగార్జున అటువంటి వివాదాల జోలికి వెళ్ళడు ఏదో మర్చిపోయి ఉంటాడు అన్నారు.

ADVERTISEMENT

అయితే ఇప్పుడు నాగ్, త్రివిక్రమ్ మధ్య ఏదో జరుగుతుందని ఖరారు అయిపోయింది. ఈరోజు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జునను ఈ వివాదం గురించి అడిగారు. “నాకు అదంతా తెలీదు. నాకు కథ చెప్పింది విజయ్ భాస్కర్ గారు. నాతో రోజు పంచ్లు వేసేవారు,” అన్నాడు నాగార్జున. ఒక మీడియా అతను త్రివిక్రమ్ గురించి రెట్టించి అడగ్గా… “నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్,” అన్నాడు నాగార్జున. దీనిబట్టి వారిద్దరి మధ్య తప్పకుండా ఏదో జరిగింది అనే అనుమానం రాకమానదు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Photos: Trisha Turns Heads In Saree At CM Event

Photos: Trisha Turns Heads In Saree At CM Event

7 minutes ago

France Layover Gets Easier: No Transit Visas for Indians

Indian travellers flying through Europe have received major relief after France removed a visa rule…

38 minutes ago