
స్పైస్ జెట్ అధినేత అజయ్ సింగ్ దీనిని కొనుగోలు చేయనున్నట్టు వచ్చిన వార్తలు మార్కెట్లో సంచలనం సృష్టించాయి. ఈ వార్తలతో ఎన్‌డీటీవీ షేరు ఒక్కసారిగా 5 శాతం లాభపడింది. డీల్ తర్వాత అజయ్ సింగ్ కు 40 శాతం, ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లకు 20 శాతం ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్‌డీటీవీకి కష్టాలు మొదలైనట్టుగా ఈ వార్తల సారాంశం. దీనికి తోడు జూన్ 5న ప్రణయ్ రాయ్ నివాసాలపై సీబీఐ దాడులు చేసింది.
మరోవైపు ఎన్‌డీటీవీ గత దశాబ్ద కాలంగా లాభాలు చూసింది లేదు. 1,474 కోట్ల నష్టాల్లో ఉన్నట్టు, ఈ నేపథ్యంలో విక్రయానికే మొగ్గు చూపినట్టు వచ్చిన వార్తలకు మరింత బలం చేకూరింది. మరోవైపు సంస్థను కొనుగోలు చేయాలని భావిస్తున్న అజయ్ సింగ్ బీజేపీకి చాలా సన్నిహితుడు, ప్రధాని మోడీ ఆంతరంగికుల్లో ఒకరు కావడంతో మార్కెట్ వర్గాలలో తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఎన్‌డీటీవీ విక్రయ వార్తలు మార్కెట్లో పెను సంచలనం కలిగించాయి.
What happens when a Gujarati film made for around Rs 50 lakh turns into a…
Kichcha Sudeepa’s birthday celebrations get a high-octane touch with the arrival of an action-packed first…