
ప్రభుత్వానికి అనుకూలంగా లేని ఏబీఎన్, టీవీ5 ప్రధానంగా ప్రభుత్వానికి టార్గెట్ గా ఉందట. కరోనా సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను మీడియా ఎండగడుతుంటే…. కరోనా పై అలుపెరుగని పోరాటం చేస్తున్న వైద్యుల ఆత్మస్థాయిర్యాన్ని దెబ్బ తీసేలా కేసులు నమోదు చేస్తున్నారని కేసులు పెడుతున్నారట.
నిన్న రాత్రి టీవీ5 జర్నలిస్టు మూర్తిని అరెస్టు చెయ్యడానికి రంగం సిద్ధం చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. నిన్న రాత్రి ప్రైమ్ టైం స్లాట్ లో మూర్తి రాకపోవడంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. సోషల్ మీడియాలో మూర్తికి మద్దతుగా ప్రతిపక్షాలు ట్రెండ్లు కూడా చేసాయి.
తమకు వ్యతిరేకంగా ఉన్న మీడియా సంస్థలపై అక్కసు వెళ్లగక్కడం జగన్ కు కొత్తేమీ కాదు. ఇప్పటికే ఆయా సంస్థలకు ప్రభుత్వం తరపున న్యాయంగా రావాల్సిన ప్రకటనలు కూడా ఆపేసి అన్నీ సాక్షికే మళ్లిస్తున్నారు. అయినా దారికి రాకపోవడంతో ఇప్పుడు డైరెక్టుగా కేసులు పెట్టడం మొదలు పెట్టినట్టు ఉన్నారు.
Last week was a fairly entertaining one for the Telugu OTT audience as we had…
The Tamil Nadu Assembly is about to witness a historic "face-off" that feels more like…