Telugu

ఈ నాన్సెన్స్ ఆపండి – ‘ఆర్ఎక్స్ 100’ హీరో!

‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో బాగా పాపులర్ అయిన కార్తీకేయకు ఇదే మొదటి సినిమా కాదు. గతంలో ‘ప్రేమతో మీ కార్తీక్’ వంటి ఒకటి, రెండు చిన్న, చితక సినిమాలలో నటించాడు గానీ, అవి సక్సెస్ కాకపోవడంతో కార్తీకేయకు గుర్తింపు రాలేదు. ఇలాంటి అప్ కమింగ్ వారంతా హీరోలుగా రావాలంటే ఎన్నో డెమో షూట్స్ చేసి ఉంటారు. అలాంటి ఓ డెమో షూట్ నే తమ సినిమా పబ్లిసిటీ ఓ చిత్ర నిర్మాణ సంస్థ వాడుకుంటోంది.

ADVERTISEMENT

[m9ad]

“సుపారి” అనే పేరుతో కార్తికేయ ఓ సినిమా చేస్తున్నాడంటూ ప్రింట్ మీడియా ప్రచురితం చేసిన ఆర్టికల్స్ ను షేర్ చేసి, సదరు వార్తలను ఖండించారు. ఇదంతా ఫేక్, అది నేను చేసిన సినిమా కాదు, ఓ సినిమా కోసం ఓ డెమో షూట్ ఇవ్వగా, అదేదో నేను ఈ సినిమాలో నటించినట్లుగా ఆ షాట్స్ ను ఇపుడు ఈ సినిమా కోసం వాడుకుంటున్నారు… అంటూ వివరణ ఇచ్చారు.

తాను డెమో ఇచ్చిన సినిమా అసలు ఇంతవరకు ప్రారంభానికే నోచుకోలేదని, కాబట్టి ఈ నాన్సెన్స్ ను ఆపాలని కోరుతున్నానంటూ… తన ట్విట్టర్ ఖాతా ద్వారా విజ్ఞప్తి చేసాడు కార్తీకేయ. ఈ డెమో షూట్స్ పై పలువురు నెటిజన్లు వేసిన ప్రశ్నలకు కూడా కార్తికేయ సమాధానం ఇచ్చారు. కేవలం అయిదారు రోజులు మినహా ఆ డెమో షూట్ నిర్వహించలేదని, అంతకుమించి ఎక్కువ చేస్తే నా సినిమానే అని అంగీకరిస్తానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చాడు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

SRH Star Back at No. 1, Jadeja’s Fall: ICC Twist!

Abhishek Sharma is back at the top of the ICC T20I batting rankings, but there…

6 minutes ago

Trivikram: Venky Cracked The Superstar Formula!

Trivikram Srinivas had special praise for Venkatesh at the pre-release event of Aadarsha Kutumbam: House…

20 minutes ago