
మరి ఏప్రిల్ 28వ తేదీన విడుదల కాబోతున్న “బాహుబలి – ది కన్ క్లూజన్” సినిమాకు జక్కన్న ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలతో రాబోతున్నారో అనే దానికి నిదర్శనంగా, నేడు రిలీజ్ చేసిన ఓ చిన్న వీడియో బైట్ నిలుస్తోంది. ‘బాహుబలి 2’కు సంబంధించినంత వరకు అధికారికంగా అన్నీ పోస్టర్లే విడుదలయ్యాయి తప్ప, చిన్న టీజర్ ను కూడా రిలీజ్ చేయలేదు. దీంతో ట్రైలర్ లో ఎవరెవరూ ఎలా ఉంటారు? అన్న ఉత్సుకత కలగడం సహజమే. అయితే తాజాగా విడుదల చేసిన ఓ చిన్న బైట్ తో, ఈ ట్రైలర్ అంచనాలను పతాకస్థాయికి తీసుకువెళ్ళాడు రాజమౌళి.
ఈ 12 సెకన్ల బైట్ లో ప్రభాస్ కనిపించింది కేవలం 4, 5 సెకన్లు మాత్రమే. అయినప్పటికీ, ఒక్క ట్రైలర్ పైనే కాదు, ఏకంగా సినిమా పైన కూడా అంచనాలు పెంచడంలో ఈ చిన్న బైట్ ను వినియోగించుకున్నాడు రాజమౌళి. ఇప్పటివరకు ముందు టీజర్, ఆ తర్వాత ట్రైలర్, రిలీజ్ కు ముందు మరికొన్ని చిన్న చిన్న టీజర్లు విడుదల చేయడం సంప్రదాయ బద్ధంగా వస్తోంది. కానీ, ‘బాహుబలి 2’కు సంబంధించి టీజర్ లేదు, నేరుగా ట్రైలరే అనుకున్నంతలో ఓ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు జక్కన్న. ఊహించని ఈ చిన్న బైట్ తో సోషల్ అండ్ మీడియా వర్గాల్లో “బాహుబలి 2” మరోసారి మోత మోగింది.
ఓ పక్కన ట్రైలర్ కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తూ ఆడియో వేడుకకు సంబంధించిన లొకేషన్స్ పై దృష్టి సారించారు. తొలి పార్ట్ ను తిరుపతిలో విడుదల చేయగా, తాజా సినిమా ఆడియోను రామోజీ ఫిల్మ్ సిటీలో విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి లొకేషన్ ను సందర్శించిన రాజమౌళి అండ్ టీం, ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటోంది. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ట్రైలర్ విడుదలకు ముందు జరుగుతున్న ఈ హంగామా ట్రైలర్ విడుదల తర్వాత ఆకాశాన్ని తాకుతుందని చెప్పడంలో సందేహం లేదు. రాజమౌళినా… మజాకా… అనిపించే రేంజ్ లో పబ్లిసిటీ చేయడం జక్కన్నకు వెన్నతో పెట్టిన విద్యే కదా..!
As we have already informed our readers, for the first time in Bigg Boss Telugu…
The municipal elections in Andhra Pradesh ended on November 1, but the political battle did…