
“ఇండియన్ సినిమాకు గర్వకారణం నీవు…” అంటూ శంకర్, రజనీకాంత్ లు కురిపించిన అభినందనలతో రాజమౌళి తడిసిముద్దయ్యాడు. అయితే ప్రస్తుతానికి జక్కన్నను పొగిడేశారు గానీ, ఈ ‘రోబో 2.0’ టీంకు అసలు కష్టం ముందుందని చెప్పాలి. ‘బాహుబలి’కి ముందు వరకు ఇండియాస్ నెంబర్ 1 దర్శకుడిగా ప్రేక్షకుల చేత, సినీ విమర్శకుల చేత నీరాజనాలు అందుకున్నాడు శంకర్. అయితే ఓ వైపు ‘ఈగ, బాహుబలి’ ద్వారా రాజమౌళి ఎదగడం, మరో వైపు ‘స్నేహితుడు, ఐ’ వంటి సినిమాలతో శంకర్ వెనక్కి రావడం ఒకేసారి జరుగుతూ వచ్చాయి.
దీంతో శంకర్ కు అసలు పరీక్ష ముందుంది. ‘రోబో 2.0’ విడుదలయ్యే సమయానికి ప్రతి ఒక్కరూ ‘బాహుబలి 2’ సాధించిన రికార్డులతో పోల్చడం ప్రారంభిస్తారు. ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లను పెట్టుకుని, శంకర్ ‘బాహుబలి 2’ రికార్డులను అందుకుంటాడా? లేదా? అన్నది కీలకం కాబోతోంది. ప్రస్తుతానికి ‘రోబో 2.0’పై పెద్దగా బజ్ లేదనే చెప్పాలి. ట్రైలర్ విడుదలైతే గానీ, ఈ సినిమాపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. చూడాలి మరి శంకర్ ‘రోబో 2.0’ ఏం చేయనుందో..!?
Sumanth Prabhas and Ananthika Sanilkumar’s Romanchakam has received a major boost on its release day,…
చిత్రం: రోమాంచకం M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 03, 2026 తారాగణం: సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్…