
సినిమా వాయిదాపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా శర్వానంద్ ‘రణరంగం’, అడివి శేష్ ‘ఎవరు’ చిత్రాలను ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో ‘సాహో’ వాయిదా ఖాయమని అంటున్నారు. మరోపక్క సినిమా బృందం వాయిదా గురించి గానీ కొత్త రిలీజ్ డేట్ గురించి గానీ పెదవి విప్పడం లేదు. అయితే దీనికి బలమైన కారణం ఉందంట. “నాలుగు భాషల్లో ఒకేసారి సినిమా విడుదల చెయ్యాలి అంటే మాటలు కాదు. అటువంటి సమయాలలో అందరు పంపిణీదారులను కూర్చోబెట్టి మాట్లాడాలి,” అని చిత్ర బృందం అంటుంది.
అయితే బాలీవుడ్ నిర్మాత టీ-సిరీస్ నిర్ణయమే కీలకం కాబోతుందని తెలుస్తుంది. నిర్మాతలు పంపిణీదారులతో ఈ విషయంగా మాట్లాడుతున్నారు. తొందరలో ఒక నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం. సాహో చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తుంది. దక్షిణాదిన ఇదే ఆమె మొదటి చిత్రం. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ ట్రేడ్ కూడా ఈ చిత్రం కోసం ఆసక్తిగా వేచి చూస్తుంది. ఇది గనుక హిట్ అయితే ప్రభాస్ బాలీవుడ్ లో కూడా పాతుకుపోవడం ఖాయం అంటున్నాయి చిత్ర వర్గాలు.
Namit Malhotra’s Ramayana has crossed $517K in US premiere advance sales, but the numbers reveal…
భోగాపురం విమానాశ్రయానికి ఎప్పుడో ప్రారంభోత్సవం జరిగింది కదా? మళ్ళీ కొత్తగా ఈ ప్రారంభోత్సవం ఏమిటి? అనే సందేహం కలుగవచ్చు. భోగాపురం…