
ఈ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ చంద్రబాబుకు పట్టం కట్టబోతున్నారని, ఇది చారిత్రక అవసరమని అంతా గ్రహించారని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 2 లేదా 3 ఈవీఎంలు పని చేయకపోతే జగన్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. దీని బట్టే ఎవరు పోలింగ్ ఎక్కువ జరగాలని కోరుకున్నారో అనేది తెలిసిపోతుందని చెప్పుకొచ్చారు. ఎన్నికల సంఘం అధికారుల మార్పిడిలో చూపిన శ్రద్ధ.. ఈవీఎంల నిర్వహణపై చూపితే బాగుండేదని ఎద్దేవా చేశారు.
పోలింగ్ ప్రక్రియలో తప్పులు జరిగినప్పుడు దాన్ని ప్రశ్నించేందుకు జగన్కు భయమెందుకని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ 79.64% కి చేరింది. ఇదే సమయంలో 2014 ఎన్నికలలో పోలింగ్ 77.96% గా ఉంది. ఈవీఎంలు సవ్యంగా పని చేసి ఉంటే ఖచ్చితంగా 82-83% నమోదు అయ్యేది. ఎక్కువ పోలింగ్ జరగడం అనేది తమకు మంచిదంటే తమకు అంటూ ఇరుపార్టీలు అంచనాలు వేస్తున్నాయి.
Yash is preparing to face audiences as Ravana in Ramayana, but his role in the…
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొలమానాలు అంటే ఒకటి పారిశ్రామిక ప్రగతి మరొకటి ఆర్థిక పురోగతి. అయితే అందులో రెండవదైన ఆర్థిక పురోగతికి…