Telugu

మెగా ఫామిలీ నుంచి మరో ప్రొడక్షన్ హౌస్..!

మెగా ఫామిలీ నుంచి వచ్చిన హీరోలతో ఒక క్రికెట్ టీం తయారుచేయచ్చు అంటు గొప్పగా చెప్పుకునే వారు ఉన్నారు అలాగే దానిని వ్యంగంగా విమర్శించే వారు ఉన్నారు. అయితే ఏది ఏమైనా ఒకరు సినిమాలో నటిస్తున్నారు అంటే ఎంతో కొంతమందికి ఉపాధి దొరికినట్టే అని భావిస్తే ఇది మంచి విషయమే అవుతుంది.

అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో హీరోలే కాదు నిర్మాతలు కూడా ఎక్కువయ్యారనే చెప్పాలి. ఇప్పటికే అల్లు అరవింద్ వారి గీత ఆర్ట్స్..,నాగబాబు గారి అంజనా ప్రొడక్షన్స్.., రాంచరణ్ కొణిదల ప్రొడెక్షన్స్…, నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్…,ఉండగా ఇపుడు తాజాగా సాయి దుర్గ గా పేరు మార్చుకున్న సాయి ధర్మ తేజ్ మరో ప్రొడ్యూషన్ హౌస్ ఏర్పాటు చేసారు.

ADVERTISEMENT

తన తల్లి పేరు మీదగా ‘విజయ దుర్గ ప్రొడ్యూషన్స్’ అంటు ఒక నిర్మాణ సంస్థను ప్రారంభించారు సాయి తేజ్. కొంతమంది స్నేహితులతో కలిసి ఈ ప్రొడ్యూషన్ హౌస్ ఏర్పాటు చేసినట్లు తెలియచేసారు. అయితే ఇందుకు గాను తన మేనమామల ఆశీస్సులు తీసుకుంటున్న ఫోటోలను షేర్ చేసారు.

నా తల్లికి ఆమె పేరు మీద ఒక చిన్న బహుమతిని ప్రకటించినందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ.., మా మామయ్య వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు విజయ దుర్గ ప్రొడక్షన్స్ కు ఉండాలని కోరుకుంటున్నా అన్నారు. అలాగే ఈ ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీద గా లాంచ్ అవ్వడం ఆనందంగా ఉందంటూ తన సోషల్ మీడియాలో షేర్ చేసారు సాయి.

హీరో గా అనుకున్నన్ని అవకాశాలు కానీ విజయాలు కానీ దక్కించుకోలేని సాయి దుర్గ తేజ్ మార్చుకున్న తన పేరుతో తన తల రాత మార్చుకుంటారేమో చూడాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ashwin Blasts Selectors Over Sarpanch T20 Snub

Ravichandran Ashwin has raised concerns over the exclusion of Shreyas Iyer from India’s T20I squad.…

34 minutes ago

Who Allowed Case Against Pawan Kalyan? HC Asks

The Andhra Pradesh High Court raised serious questions over the criminal complaint filed against Pawan…

2 hours ago