
Sai Pallavi's portrayal of Sita in Ramayana has sparked a debate on whether the role demands glamour or powerful acting, with many fans backing her performance over appearance.
ఢిల్లీలో రామాయణ ట్రైలర్ ఈవెంట్ జరిగినప్పటినుండి వినిపిస్తున్న ఒక కామన్ కామెంట్ “సీతగా సాయిపల్లవి అందంగా కనిపించడం లేదు”. అదేరోజు ఈవెంట్ కి అటెండ్ అయిన రకుల్ తో కంపేర్ చేసి.. రకులే అందంగా ఉంది కదా అన్నారు.
ఇక నిన్న ట్రైలర్ రిలీజ్ అయినప్పటినుండి మాత్రం ఆ కామెంట్స్ ఇంకాస్త తీవ్రతరమై.. ఆఖరికి సాయిపల్లవి పక్కన చెలికత్తెలా ఉన్న అమ్మాయి అందంగా ఉంది కానీ, సాయిపల్లవి సీత పాటకి సెట్ అవ్వలేదు అని తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఆ పక్కన ఉన్న అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఐడీ వెతికి మరీ ఆమెను ఫేమస్ చేస్తున్నారు.
అయితే.. సీత పాత్రలో నటించే నటీమణి అందంగా ఉండాలా, లేక సీత లక్షణాలను తెరపై ప్రదర్శించేలా ఉండాలా అనే విషయాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. సీత సాత్వికురాలు, ఆదర్శ గృహిణి, మొండిపట్టుకు ప్రతీక. సీత పాత్రలో కనిపించాల్సినవి అవి కానీ.. అందంగా, గ్లామర్ గా కాదు.
ఈ చిన్న విషయాన్ని కొత్త తరం అర్థం చేసుకోలేకపోతుందా? లేక కావాలనే సాయిపల్లవిని ఏదో ఒకటి అనాలి కాబట్టి ట్రోల్ చేస్తున్నారా? అనేది తెలియదు కానీ.. ఆమెను ఎంతమంది ట్రోల్ చేస్తున్నారో, అంతకంటే ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారు.
ఎలాంటి మహిళా ప్రధాన సినిమాలు చేయకుండా, కేవలం మంచి పాత్రలతో, పాజిటివ్ అపీరియన్స్ తో సాయిపల్లవి సాధించుకున్న క్రెడిట్ అది. లేడీ పవర్ స్టార్ అని ఊరికే అంటారా?. ఇకనైనా సాయిపల్లవిని ఒక బ్యూటీ డాల్ లా చూడడం మానేసి, ఆమెలోని నటిని చూడగలిగితే.. ప్రస్తుత తరంలో సీతగా నటించడానికి ఆమెకు మించిన నటి మరొకరు లేరు అని అందరూ ముక్తకంఠంతో ఏకీభవిస్తారు.
The grand launch of the M.S. A Legacy On Screen Launch event was held at…
An Instagram reel showing a chariot procession in Lewisham, London, has gone viral. The footage…