
‘సేక్రెడ్ గేమ్స్’ చుట్టూ వివాదాలు ముసురుకుంటున్న నేపథ్యంలో సైఫ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో సదరు వ్యాఖ్యలు చేశాడు. మన కులం కాని వారితో డేటింగ్ చేసినా, ప్రభుత్వాన్ని విమర్శించినా ఎవరో ఒకరు చంపేయడం ఖాయమని సైఫ్ పేర్కొన్నాడు. ఇప్పుడీ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు.
‘సేక్రెడ్ గేమ్స్’పై తొలి నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మితిమీరిన శృంగారం, హింస, రాయలేని భాషలో పదప్రయోగం వంటివి ఇందులో ఉపయోగించారు. ముఖ్యంగా భారత రాజకీయాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని చూపించినందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ షోపై కోర్టుకెక్కింది. రాహుల్ గాంధీ ఇటీవల ఓ ట్వీట్ చేస్తూ తన తండ్రి దేశం కోసం పనిచేశారని, సేవ చేస్తూ ప్రాణాలొదిలారని పేర్కొన్నారు.
Chiranjeevi’s ambitious fantasy film Vishwambhara is reportedly targeting a Sankranthi release on January 13, with…
Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…