
ఎప్పుడూ లేనట్టుగా సంక్రాంతి కి ఈ సారి ఐదు సినిమాలు విడుదల అవుతున్నాయి. దానితో థియేటర్ల పంచాయతీ తలపోటుగా మారింది. ఎవరూ వెనక్కు తగ్గేలా కనపడకపోవడం తో ఇంకో మీటింగ్ కు సిద్ధం చేస్తున్నారట ఇండస్ట్రీ పెద్దలు.
ఈగల్ ఇప్పటికే వాయిదా పడిందని వార్తలు వస్తున్నా నిర్మాతలు ఖండిస్తున్నారు.
అయితే M9 News కి ఉన్న సమాచారం ప్రకారం ఒక నిర్మాత తప్పుకోవడానికి రెడీ నే కానీ తమ సినిమాకు సోలో డేట్ ఇవ్వాలంటున్నారట.
“ప్రస్తుతానికి మాకు ఉన్న థియేటర్ల తో మాకు ఇబ్బంది లేదు. మేము వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఒకవేళ మమల్ని ఆబ్లిగేట్ చెయ్యాలంటే మాత్రం ఫిబ్రవరి 9 న మాకు సోలో డేట్ ఇవ్వాలి,” అని ఆ నిర్మాత అంటున్నారు.
ప్రస్తుతం నాగవంశీ ఆ డేట్ ని తన టిల్లు స్క్వేర్ కోసం లాక్ చేసుకున్నారు.
అయితే నాగవంశీ ఆ డేట్ ఇస్తారా? సంక్రాంతి సినిమాలలో గుంటూరుకారం కి పెద్దగా ఇబ్బంది లేదు. ఒక్క హనుమాన్ తోనే అంతో ఇంతో ఇబ్బంది. ఎందుకంటే ఎంత చిన్న రిలీజైన ఓపెనింగ్స్ షేర్ చేసుకోవాలి కాబట్టి.
ఫిబ్రవరి 9 డేట్ ఇవ్వాలంటే నాగవంశీ హనుమాన్ కదిలితే తప్ప ఇవ్వరు. ఆ రకంగా ఒకటి కాదు రెండు సినిమాలు (ఒప్పుకున్న నిర్మాత, హనుమాన్) తప్పుకోవాలి.
తమకు హిందీలో ఇబ్బంది కాబట్టి హనుమాన్ నిర్మాత ఇప్పటికే వాయిదా కుదరదు అనేశారు. దీనితో రేపు జరిపే మీటింగ్ లో ఎటువంటి నిర్ణయం జరుగుతుందో చూడాలి.
Vijay Deverakonda is making another move outside cinema, and this time he is putting his…
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (‘సర్’) ప్రక్రియలో భాగంగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్‌కు నోటీసు ఇచ్చినప్పుడు అందుకు…