
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. అతి త్వరలోనే దియా మీర్జా పాల్గొనే సన్నివేశాలు మొదలు కానున్నాయి. మరోవైపు ఇంకో పాత్రకు సైయామి ఖేర్ ని తీసుకున్నట్టు సమాచారం. ఈమె గతంలో సాయి ధరమ్ తేజ్ రేయ్ సినిమాలో నటించింది. అయితే ఆ తరువాత బాలీవుడ్ లో స్థిరపడింది.
అక్కడ పెద్దగా సినిమాలు లేకపోయినా అడపాదడపా సినిమాలు వస్తున్నాయి. ఆమె వైల్డ్ డాగ్ లో రా ఏజెంట్ గా కనిపించబోతుంది సమాచారం. అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ వర్మను పోలీస్ శాఖలో అందరూ ‘వైల్డ్ డాగ్’ అని పిలుస్తుంటారు. నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని తీర్చిదిద్దిన వైల్డ్ డాగ్ ఈ వేసవికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలతో సతమతం అవుతున్నారు నాగార్జున. ఇటీవలే ఆయన హీరోగా తెరకెక్కిన మన్మథుడు 2 దారుణంగా ఫెయిల్ అయ్యింది. ఈ సినిమాతో నాగ్ ఇమేజ్, మార్కెట్ కూడా దెబ్బతింది. దీనితో ఆయన తన పంథా మార్చి డిఫరెంట్ సబ్జక్ట్స్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. దీనిలో వైల్డ్ డాగ్ అనే యాక్షన్ సినిమా చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ఆయన హిట్ కొడతారో లేదో చూడాలి.
2023 తెలంగాణ సార్వత్రిక ఎన్నికలలో బిఆర్ఎస్ ఓటమి తరువాత ప్రజా క్షేత్రంలో కనిపించని కేసీఆర్, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ లో…
YS Jagan Mohan Reddy seems to have found his biggest election issue even before the…