
2008లో తెలంగాణాలో ఇటువంటి ఎన్కౌంటరే జరిగింది. అప్పుడు ఇద్దరి ఇంజనీరింగ్ విద్యార్థినుల మీద తమ ప్రేమను ఒప్పుకోలేదని ముగ్గురు కలిసి యాసిడ్ దాడికి పాల్పడ్డారు. అప్పుడు కూడా ఇప్పటిలానే పెద్ద ఎత్తున పబ్లిక్ నిరసన వచ్చింది. అప్పుడు కూడా వారు ఎన్కౌంటర్ చెయ్యబడ్డారు.
అప్పుడు కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం తీసుకుని వెళ్తుంటే వారు తప్పించుకోబోయారు అని పోలీసులు చెప్పారు. పోలీసుల మీద రాళ్ల తో దాడి చెయ్యగా, ఆత్మరక్షణలో భాగంగా వారిని ఎన్కౌంటర్ చేశారని రికార్డులలో ఉంది. అయితే ఎన్కౌంటర్ చేసిన విధానమే కాదు. వ్యక్తి కూడా ఒకరే.
అప్పుడు ఎన్కౌంటర్ సమయంలో వరంగల్ ఎస్పీ గా ఉన్న వీసీ సజ్జనార్ ఇప్పుడు సైబరాబాద్ పోలీసు కమీషనర్ గా ఉన్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే సజ్జనార్ ను హీరోగా కీర్తిస్తున్నారు. కొందరు ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అని వాదిస్తుంటే కొందరు ఇదే సహజమైన న్యాయం అంటున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల మద్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్యపోరులో బీఆర్ఎస్ పార్టీ నిత్యం ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నామస్మరణ…
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan have reportedly…