
అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలల పాటు కొత్త ఇసుక పాలసీ అంటూ తవ్వకాలు నిలిపివేశారు. ఈ లోగా వరదల వల్ల కొరత ఎక్కువైంది. ఇప్పుడు వర్షాలు తగ్గడంతో మళ్ళీ తవ్వకాలు మొదలయ్యాయి. ఇప్పటివరకు మూటగట్టుకున్న చెడ్డపేరును చెరిపేసుకునే ప్రయత్నం చేస్తుంది జగన్ ప్రభుత్వం. అందులో భాగంగా ఈరోజు అన్ని రిచ్ లలో ఇసుక రేట్ల యాడ్ ఇచ్చింది ప్రభుత్వం.
ఇసుక అక్రమాలు తెలపడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చింది. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే 2 లక్షల జరిమానా, రెండు సంవత్సరాల జైలు శిక్ష అంటూ ఆ ప్రకటనలో తెలిపింది. ఇదంతా బానే ఉంది. ఈ ప్రకటన ఈనాడు ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చింది. అది కూడా బానే ఉంది. సాక్షికి మాత్రం ఏపీ, తెలంగాణ, గ్రేటర్ హైదరాబాద్ ఎడిషన్స్ లో యాడ్ ఇచ్చింది.
ఇసుక కొరత ఉన్న సమయంలో పక్క రాష్ట్రాలకు ఇసుక అమ్మే అవకాశం ఉండదు. అప్పుడు తెలంగాణ, గ్రేటర్ హైదరాబాద్ ఎడిషన్స్ లో యాడ్ ఎందుకు? ఒకవేళ పక్క రాష్ట్రాలకు అమ్ముకునే అంతటి ఇసుకని ప్రభుత్వం రెడీ చేసుకుందని అనుకుందాం. అత్యధిక సర్క్యూలేషన్ కలిగిన ఈనాడుకి కాకుండా సాక్షికి తెలంగాణ, గ్రేటర్ హైదరాబాద్ ఎడిషన్స్ యాడ్స్ ఇవ్వడం ఏంటి? ప్రభుత్వ సొమ్ముని సాక్షిని మళ్లిస్తున్నారు అని అనుకోవాలా అని సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నిస్తున్నారు.
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…
One issue becoming impossible to ignore in the cinema industry is the growing fear surrounding…