
మహేష్ కు ఎలా అయితే మూడక్షరాల సెంటిమెంట్ ఉందో, దర్శకుడు శ్రీవాస్ కు కూడా ఓ సెంటిమెంట్ ఉంది. తొలి సినిమా టైటిల్ ను “లక్ష్యం”తో ప్రారంభించి ‘గ్రాండ్ విక్టరీ’ కొట్టిన శ్రీవాస్, ఆ తర్వాత ‘రామ రామ కృష్ణ కృష్ణ, పాండవులు పాండవులు తుమ్మెద తుమ్మెద’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించి సక్సెస్ ను దూరం చేసుకున్నారు. ఆ తర్వాత తనకు అచ్చి వచ్చిన ‘లౌక్యం’ను టైటిల్ గా పెట్టి బంపర్ హిట్ కొట్టారు.
అయితే ఆ తర్వాత ‘డిక్టేటర్’ టైటిల్ తో మళ్ళీ విజయానికి దూరమయ్యారు. ఈ తరుణంలో ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ తో ప్రారంభించిన సినిమాకు ఏ టైటిల్ పెడతారా? అనుకున్న తరుణంలో… లక్ష్యం, లౌక్యం ఎలా ఉన్నాయో… సరిగ్గా అదే తరహాలో “సాక్ష్యం” అన్న టైటిల్ ను ఖరారు చేసారు. మోషన్ పిక్చర్ ద్వారా ఈ టైటిల్ ను ప్రకటించారు.
‘ఫిదా’ ఫేం శశికాంత్ కార్తీక్ సంగీతం హైలైట్ గా ఈ మోషన్ పిక్చర్ ను విడుదల చేసారు. ‘నేచర్ ఈజ్ విట్ నెస్’ అంటూ విడుదల చేసిన ఈ వీడియోలో బెల్లంకొండ శ్రీనివాస్ ను పవర్ ఫుల్ రోల్ లో చూపిస్తున్నట్లుగా ప్రతిబింబించారు. బెల్లంకొండ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, మరో కీలకపాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…