Telugu

థియేటర్లు దాటి…ఓటీటీలకు…!

సిల్వర్ స్క్రీన్ మీద తమ స్టామినా చూపించి ప్రేక్షకులను అలరించిన సినిమాలు ఓటిటి లో కూడా దుమ్ములేపుతున్నాయి. సలార్ సినిమాతో ప్రభాస్, ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్థాయిలో వెండి తెర మీద తమ ‘ఖాన్సార్’ విలువను సుమారు 700 కోట్లకు చేర్చారు. డిసెంబర్ 22 న థియేటర్ల ముందుకొచ్చిన సలార్ విడుదలైన నెల లోపే జనవరి 20 న ప్రముఖ ఓటిటి వేదికైన నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది.

దాదాపు 3 గంటల లోపు రన్ టైం ఉన్న మూవీలో ప్రభాస్ డైలాగ్ సుమారుగా 3 నిముషాలు మాత్రమే ఉండడం దానిని కూడా ప్రేక్షకులు నెత్తినపెట్టుకోవడం చూస్తే “కట్ అవుట్ ఉన్నవాడికి కాన్వర్జేషన్” తో పనిలేదని నిరూపించబడింది. అలాగే ఓటిటిలో కూడా సలార్ గ్లోబల్ టాప్ 10 లో నిలిచి బుల్లి తెర మీద కూడా తన హావ కొనసాగించింది. అలాగే కలెక్షన్లతో థియేటర్లను షేక్ చేసిన యానిమల్ మూవీ కూడా బుల్లితెర పై ప్రదర్శనకు వచ్చింది.

ADVERTISEMENT

రిపబ్లిక్ డే సందర్భంగా రణ్ బీర్, సందీప్ వంగా యాక్షన్ డ్రామా అయిన యానిమల్ నెట్ ఫ్లిక్స్ వేదికగానే బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది. సుమారు 900 కోట్లు వసూళ్లు చేసి బాక్స్ ఆఫీస్ రికార్డులకెక్కిన యానిమల్ మూవీ ఓటిటిలో తన రన్ టైం ని పెంచుకుని కూడా టాప్ ప్లేసులో ట్రెండ్ అవుతుంది. అలాగే గతేడాది నవంబర్ లో థియేటర్ల ముందుకు వచ్చిన సప్త సాగరాలు దాటి మూవీ కూడా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది.

ఫీల్ గుడ్ మూవీ గా పేరుతెచ్చుకున్న సప్త సాగరాలు దాటి సైడ్ ఏ…సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకుని సీక్వెల్ గా తెరకెక్కిన సప్త సాగరాలు దాటి సైడ్ బి…కూడా ఓటిటి లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం ఎన్నో రోజుల నుండి ఎదురుచూపులు చూసిన ప్రేక్షకులకు చిత్ర యూనిట్ సినిమాను ఓటిటి లోకి అందుబాటులోకి తెచ్చింది.

రక్షిత్ శెట్టి , రుక్మిణి వసంత్ సప్త సాగరాలు పార్ట్ 1 లో తమ నటనతో ప్రేక్షకులను కట్టి పడేసారు. దీనితో ఈ సినిమా సీక్వెల్ పై ప్రేక్షకులలో ఆసక్తి మొదలయ్యింది. ఎట్టకేలకు ఈ సినిమాలన్నీ థియేటర్లను దాటి…ఓటిటిలోకి అందుబాటులోకి రావడంతో ఓటిటి లవర్స్ హాలిడేస్ లో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vijay Made A Huge Mistake, No Doubt!

Thalapathy Vijay is one of the biggest names associated with Tamil cinema, and he has…

17 minutes ago

Laxman Gave Vaibhav Chances, GG Hasn’t: Is It Fair?

Vaibhav Sooryavanshi was once again left out of India's playing XI for the fourth T20I…

47 minutes ago