
మనం చూడని కామెడీ ఏముంటుందనే అంచనాకు ప్రేక్షకులు ముందుగా వచ్చేయడమే. అందుకే టీమ్ తెలివిగా ముందస్తు ప్రీమియర్లు వేసి వాటి సోషల్ మీడియా టాక్ నే ప్రమోషన్ గా వాడుకుంది. కథగా చెప్పుకుంటే చాలా సింపుల్ లైన్ ఇది. మల్టీప్లెక్స్ ఉద్యోగి బాలు(శ్రీవిష్ణు)ఇంటికి కొన్ని విచిత్ర పరిస్థితుల వల్ల సరయు(రెబ్బ మోనికా జాన్) పేయింగ్ గెస్టుగా వస్తుంది. బాలు తండ్రి(నరేష్)దో వెరైటీ గాథ. ఊహించినట్టే హీరో హీరోయిన్ ప్రేమలో పడతారు.
తీరా పెళ్లిని పెద్దల దాకా తీసుకెళదామనుకునే సమయానికి ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది. దెబ్బకు ప్లానింగ్ ఖంగాళీ అవుతుంది. ఆ తర్వాత జరిగే మలుపుల ప్రయాణమే స్టోరీ. దర్శకుడు రామ్ అబ్బరాజు ఎవరూ చెప్పని కథను తీసుకోలేదని ఆయనకీ తెలుసు. అందుకే హాస్యం మీద దృష్టి పెట్టాడు.
వర్తమానంలో జరిగే ట్రెండీ సంఘటనలను సంభాషణల్లో జొప్పిస్తే బాగా నవ్వించవచ్చని గుర్తించిన రామ్ దానికి తగ్గట్టే తొలి ముప్పావు గంట శ్రీవిష్ణు, నరేష్ పాత్రల ద్వారా వీలైనంత హాస్యాన్ని పండించుకుంటూ పోయాడు. జాతిరత్నాలుని నవీన్ పోలిశెట్టి టైమింగ్ నిలబెట్టినట్టే ఇక్కడ తండ్రి కొడుకుల ఎపిసోడ్ కాలక్షేపానికి లోటు లేకుండా చేసింది.
ప్రాథమికంగా ఇది ఇబ్బందులు పడే లవర్స్ కథే అయినా రెండు కుటుంబాల మధ్య నడిచే ఫన్ రైడ్ గా మార్చుకోవడంతో కనెక్టివిటి పెరిగిపోయింది. ఇదే సినిమాని చాలామటుకు కాపాడింది. ఇంటర్వెల్ దగ్గర అసలు ట్విస్టుని రివీల్ చేశాక రామ్ అబ్బరాజు చేతిలో మరో గంటకు సరిపడా కంటెంట్ లేకపోవడంతో రిపిటీషన్ పెరిగిపోయింది.
కులపిచ్చి ఉన్న పాత్రలో వెన్నెల కిషోర్ కాసేపు లాకొచ్చినా అది కూడా ఒక స్టేజి దాటాక మళ్ళీ చూస్తున్నట్టే అనిపిస్తుంది. అయితే ఇలా గ్రాఫ్ ఎగుడుదిగుడు అయిన ప్రతిసారి ఒక మంచి ఫన్ సీన్ తో కాపాడుకుంటూ రావడం ద్వితీయార్థాన్ని మరీ బ్యాడ్ కాకుండా కాపాడింది. రైల్వే స్టేషన్ లో జెర్సీ స్పూఫ్ దానికి మంచి ఉదాహరణ. అయితే సిల్లీగా అనిపించే సీన్లు, రొటీన్ గా అనిపించే ఎమోషన్లు అంతగా వర్కౌట్ కాలేదు
ఇదంతా ఎలా ఉన్నా ఒక్కసారి కాలక్షేపానికి లోటు లేకుండా రామ్ అబ్బరాజు సామజవరగమనని నడిపించడం పెద్ద ప్లస్. క్యాస్టింగ్ ని బాగా సెట్ చేసుకున్నారు. నరేష్ సీనియారిటీని ఎలా వాడుకోవచ్చో ఈ సినిమా మరోసారి చూపిస్తుంది. శ్రీవిష్ణు ఎప్పటిలాగే తన టైమింగ్ తో నిలబెట్టాడు. రెబ్బా మోనికా కూల్ గా మెప్పించేసింది. గోపీ సుందర్ లాంటి టాప్ టెక్నీషియన్ నుంచి ఆశించే మ్యూజిక్ అయితే ఇది కాదు. టికెట్ కొన్నాం, టైం పాస్ అయితే చాలు అనుకుంటే నిరాశపరచని సామజవరగమనని నిలబెట్టేది కామెడీనే.
Andhra Pradesh's municipal election campaign has barely begun, but the first day of nominations has…
Sai Dharam Tej is pinning big hopes on Sambarala Yeti Gattu. Made on the biggest…