
కొందరు డిస్ట్రిబ్యూటర్లతో దీని కోసం నిర్మాతలు చర్చలు జరుపుతున్నారట. చైనాలో వర్క్ అవుట్ ఐన భారతీయ చిత్రాలను పరిశీలిస్తే ఎక్కువగా ఎమోషనల్ చిత్రాలే కనిపిస్తాయి. ఓ బేబీ కూడా అదే కోవకి చెందినది కావడంతో సినిమా అక్కడ కచ్చితంగా వర్క్ అవుట్ అవుతుందని చిత్రబృందం నమ్మకం. అయితే చైనా పరిమిత స్థాయిలోనే పరభాషా చిత్రాల విడుదలను అనుమతిస్తుంది అక్కడి ప్రభుత్వం దీనితో సినిమా విడుదలకు అక్కడ పెద్ద ప్రక్రియే ఉండబోతుంది. రాజమౌళి వల్ల కానిది సమంత వల్ల అవుతుందా?
మరోవైపు ఈ చిత్రాన్నహిందీలో రీమేక్ చేయాలని హీరో రానా దగ్గుబాటి భావిస్తున్నాడట. ఇక ఈ మూవీ టైటిల్ రోల్లో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కనిపిస్తుందని సమాచారం. గతంలో ‘రాజీ’ అనే చిత్రం ద్వారా అలియా భట్ మంచి విజయాన్ని అందుకోవడమే కాదు.. తన నటనకు కూడా ప్రముఖుల నుంచి ప్రశంసలు అందాయి. కాబట్టి అలియా అయితేనే టైటిల్ రోల్ బాగా పండుతుందని రానా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రామాయణ, మహాభారతాల ఆధారంగా అనేక భాషల్లో అనేక సినిమాలు వచ్చాయి. అయినా ఇంకా తీస్తూనే ఉన్నారు. మరో వందేళ్ళ తర్వాత…
A massive data leak at the Central Board of Film Certification (CBFC) has exposed records…