
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ తారామణి, ‘రంగస్థలం’ టీజర్ రిలీజ్ తర్వాత వస్తున్న ఫీడ్ బ్యాక్ కు కృతజ్ఞతలు చెప్తోంది. ఈ టీజర్ లో తమ అభిమాని కనిపించనందుకు, తామే పెట్టుకున్నామంటూ రామ్ చరణ్ ను పక్కన సమంతను కూర్చోపెట్టి ఓ ఫోటోను అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దీంతో సదరు ఫోటోకు ముగ్దురాలైన సమంత, ఆనందంతో పరవశిస్తూ రిప్లై ఇచ్చింది. తన ఫ్యాన్స్ కే కాదు, బహుశా తనక్కూడా అలాంటి భావనే ఉందేమో గానీ, ఈ రిప్లై వైరల్ అయ్యింది.
అయితే ఇది చూసిన అనసూయ అభిమానులు కూడా మరికాసేపటికి ఈ టీజర్ లో సమంతతో పాటు అనసూయ కూడా కనిపించలేదని ఓ ట్వీట్ ను పోస్ట్ చేయగా, దానికి అనసూయ కూడా రిప్లై ఇచ్చింది. ఈ టీజర్ బాగున్నప్పటికీ, సమంత, అనసూయ ఫ్యాన్స్ ను నిరుత్సాహపరిచింది అంటూ ఓ ఫ్యాన్ ఇచ్చిన పోస్ట్ కు, ‘డోంట్ వర్రీ, దీనికంటూ ఓ కారణం ఉంటుంది, ప్రస్తుతం మన చిట్టిబాబును చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదంటూ’ రిప్లై ఇచ్చింది. అసలు హీరోయిన్ సమంతే కనిపించలేదంటే, సైడ్ రోల్ చేసిన అనసూయ కూడా కనిపించలేదని పోస్ట్ చేయడం మరీ ఓవర్ గా లేదు అనడం నెటిజన్ల వంతవుతోంది.
Jailer 2 is back in the news for an interesting reason. Rajinikanth had recently said…
దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టులో నిన్న నీళ్ళు పారాయి. అలాగే దశాబ్దాలుగా విశాఖ వాసులు ఎదురు చూస్తున్న గోదావరి జలాలు పోలవరం…