Telugu

మాకు సమంత గతంతో పనిలేదు

టాలీవుడ్ హీరోయిన్ అనే బిరుదు నుండి అక్కినేని కోడలు అనే బ్రాండ్ తెచ్చుకున్న సమంత ఇటివలే భర్త నాగ చైతన్య నుండి విడిపోయిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఇద్దరం విడిపోతున్నాం అంటూ చెప్పడమే ఆలస్యమే. ఇక సమంత కెరీర్ అయిపోయినట్టే, అక్కినేని కాంపౌండ్ దాటి ఆమెకి ఎవ్వరూ అవకాశాలు ఇవ్వరనే అనుమానాలు మొదలయ్యాయి.

కానీ ఇప్పుడు సమంత జోరు చూస్తుంటే తగ్గేదే లే అనే డైలాగ్ గుర్తొస్తుంది. అవును వరుస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ అవ్వనుంది సమంత. ఇప్పటికే తెలుగు , తమిళ్ లో ఓ బైలింగ్వెల్ సినిమా సైన్ చేసింది సమంత. అలాగే OTT కోసం ఓ మరో వెబ్ సిరీస్ కూడా చేయబోతుంది. నాని చేయబోయే ‘దసరా’ సినిమాలో ఓ గెస్ట్ క్యారెక్టర్ కోసం సమంత ని అప్రోచ్ అయ్యారని టాక్. ఇవే కాదు సమంత లిస్టు లో మరిన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయట. బాలీవుడ్ , కోలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు లైనప్ లో ఉన్నాయని తెలుస్తుంది.

ADVERTISEMENT

సమంత చేయబోయే వెబ్ సిరీస్ ఈసారి ఆహ కోసం అని సమాచారం. ఇప్పటికే సమంత తో ఓ టాక్ షో చేసిన ఆహా తాజాగా ఆమెకి మంచి డీల్ తో సిరీస్ ఆఫర్ ఇచ్చారట. ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినట్టే. త్వరలోనే ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం విడాకులు తీసుకొని తన ఓన్ లైఫ్ లీడ్ చేసుకోబోతున్న సమంత ఇకపై మరింత స్పీడ్ పెంచి సినిమాలు , సిరీస్ లు ప్లాన్ చేసుకుంటుంది. త్వరలోనే గుణశేఖర్ డైరెక్షన్ లో రానున్న ‘శాకుంతలం’ తో మళ్ళీ పుంజుకోవాలని చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే రిలీజ్ డేట్ రానుంది.

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by
Tags: cross link

Recent Posts

I’ll Watch Sigma in Theatres – SS Rajamouli

Sigma starring Sandeep Kishan and Faria Abdullah is directed by Jason Sanjay, son of TN…

1 hour ago

Arjun May Not Speak, But His Love Will Be Seen

Itllu Arjuna starring Aniesh and Anaswara Rajan drew attention in the industry with the New…

2 hours ago