
మీడియాలో వస్తున్నట్లుగా అక్టోబర్ లో జరగనున్న తమ వివాహం అంగరంగ వైభవంగా ఉండబోదని, కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తులు, స్నేహితుల మధ్య మాత్రమే జరుగుతుందని, అది కూడా ఓ సాధారణ కుటుంబ వివాహం ఎలా జరుగుతుందో అలాగే ఉంటుంది తప్ప, భారీ స్థాయిలో ఉండబోదని తేల్చిచెప్పిన సమంత, పెళ్ళైన మూడవ రోజే మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటామని స్పష్టం చేసింది.
చైతూ – సమంతలు ఇద్దరు ముందుగానే ఈ నిర్ణయం తీసుకున్నారో లేక పత్రికా ముఖంగానే ఈ విషయం చైతూకు తెలుస్తుందో ఏమో గానీ, ఇది మాత్రం ఊహించని సంఘటనే. బహుశా తాము కమిట్ అయిన సినిమాల షూటింగ్ లు పూర్తి చేసి, చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇద్దరు సస్పెండ్ చేయాలని భావిస్తున్నారేమో! ఏది ఏమైనా హనీమూన్ గురించి కూడా బహిరంగంగా వ్యాఖ్యానించగల సమర్ధురాలు ఒక్క సమంతనే అని చెప్పకతప్పదు.
Ravi Teja’s Irumudi has become the sensational blockbuster of the year, with the film now…
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…