
సమంత తనకు ఆరోగ్యపరమైన ఇబ్బందులున్నాయని, మైస్టైటిస్ అనే జబ్బు కి ట్రీట్మెంట్ తీసుంటున్నాని త్వరలోనే కోలుకుంటానని, ట్విట్టర్లో సిలైన్ ఎక్కించుకుంటూ చేతుల్తో లవ్ సింబల్ ఫోజ్ ఇస్తూఉన్న ఫోటో పెట్టింది. ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసార్డర్ వలన వచ్చిన జబ్బని, డాక్టర్స్ త్వరగా కోలుకుంటావని చెప్పారని ట్విట్టర్లో రాసింది.
సమంత సిద్దార్థ్ తో కలిసి జబర్దస్త్ సినిమా చేస్తున్నపుడు చర్మ సంబంధిత వ్యాధికి గురయ్యింది. ఆ కారణం గానే ఆ సినిమా రిలీజ్ ఆలస్యమైంది. అలాగే అల్లుడు శీను సినిమా సమయం లోనూ సమంత ఆరోగ్యం ఇబ్బందులకు గురిచేసింది. ఆ తరవాత ఆమెకు డయాబెటిస్ వచ్చిందని, ఎండలో ఎక్కువ సేపు ఉంటె చర్మం మీద దద్దుర్లు వచ్చి ఇబ్బంది కలుగుతుందని, సమంత బయటకే రావడం మానేసిందని మీడియాలో వార్తలొచ్చాయి.
ఇప్పుడు సమంత కొచ్చిన మైస్టైటిస్ అనే జబ్బు దీర్ఘకాలిక వ్యాధి. ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధులకు ప్రధానకారణం ఒత్తిడి. తన బిజీ షెడ్యూల్ వల్లనో, లేక తన వివివాహ విషయం లో జరిగిన పరిణామాల వల్లనో సమంత తీవ్ర ఒత్తిడికి గురయి ఉంటుంది. మైస్టైటిస్ అనేది నరాలను, కండర్రాలను బలహీన పరిచే వ్యాధి. నడుస్తూ నడుస్తూ మనిషి పడిపోవచ్చు, ఎముకలు విరిగిపోవచ్చు. అయినా ఇటువంటి వ్యాధులు ఒక సారి వచ్చాయంటే అంత త్వరగా తగ్గవు. చాలా రోజులు నిష్టగా డైట్ పాటించాలి. ప్రకృతికి దగ్గరగా జీవించాలి.
సెలబ్రిటీస్ అప్పుడప్పుడు ఇలాంటి వ్యాధులబారినపడటం సహజమే. తన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కునే సమంత ని చూసి అమ్మాయిలు స్ఫూర్తి పొందుతున్నారు, అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. సమంత ‘యశోద’ సినిమాద్వారా త్వరలో అభిమానులను నవంబర్ 11 న పలకరించబోతుంది. ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉన్నా.. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటం తో సమంత ఇంటి నుండే డబ్బింగ్ చెప్పడం మెచ్చుకోతగినది. సమంత త్వరగా కోలుకోవాలని, మరిన్ని మంచి పాత్రలు చెయ్యాలని కోరుకుందాం.
Retired IPS officer AB Venkateswara Rao is set to contest the Vijayawada Municipal Corporation mayoral…
Nani and Vijay Deverakonda are moving away from the romantic entertainers and emotional dramas that…