Telugu

ఒకప్పుడు కలిసి… ఇప్పుడు ఎవరికి వారే..!

నాగచైతన్య – సమంతల ప్రేమకు పునాది పడిన “ఏ మాయ చేసావే” సినిమా గుర్తుందా? ఈ సినిమాలో మహేష్ బాబు బావ సుధీర్ బాబు కూడా ఓ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇలా ఈ ముగ్గురు కలిసిన ఈ సినిమా సాధించిన విజయం పక్కన పెడితే, చాలామంది ప్రేమికులకు డ్రీం ప్రాజెక్ట్ గా మారిపోయింది.

[m9ad]

ADVERTISEMENT

కట్ చేస్తే… 2018కి వచ్చేసరికి అదే ముగ్గురు మూడు సినిమాలతో ఒకే రోజు పోటీ పడుతున్నారు. అవును… “శైలజారెడ్డి అల్లుడు” ద్వారా నాగచైతన్య… “యూ టర్న్”తో సమంత… “నన్ను దోచుకుందువటే” సినిమాతో సుధీర్ బాబు… ఇలా ముగ్గురు సెప్టెంబర్ 13వ తేదీన బాక్సాఫీస్ బరిలో నిలవబోతున్నారు.

సమంత, సుధీర్ బాబు సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వెలువడగా, ఆగష్టు 31వ తేదీ నుండి వాయిదా పడిన చైతూ ‘శైలజారెడ్డి అల్లుడు’ కూడా సెప్టెంబర్ 13వ తేదీకే ఫిక్స్ అయ్యిందన్న సమాచారం అందింది, కాకపోతే నిర్మాణ సంస్థ అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది, అంతే..!

కలిసికట్టుగా నటించినపుడు అద్భుతమైన విజయంతో పాటు మధురానుభూతులను పంచుకున్న ఈ ముగ్గురు, విడివిడిగా ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందనలు తెచ్చుకుంటారో చూడాలి. ఈ మూడు సినిమాలలో సమంత ‘యూ టర్న్’ సేఫ్ ప్రాజెక్ట్ గా నిలువగా, ఆ తర్వాత స్థానాలలో సుధీర్, చైతూ ప్రాజెక్ట్ లు ఉన్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Summer Holidays Review: A Tender Tale of Two Kids

BOTTOM LINE A Tender Tale of Two Kids RATING 2.5/5 Story, Screenplay,Director: Srikar Nayan G…

2 hours ago

Why Is the Rajamouli vs Ramayana Comparison a Big Joke?

Rajamouli-Mahesh's Varanasi Big Expectations After Ramayana Why Is the Rajamouli vs Ramayana Comparison a Big…

3 hours ago