చరణ్‌తో మళ్లీ చేస్తానంటున్నాడు

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో ‘రచ్చ’ చేసిన సంపత్‌ నంది ఒక్క సారిగా స్టార్‌ డైరెక్టర్‌ అయ్యాడు. కాని ఆ క్రేజ్‌ను దర్శకుడు ఉపయోగించుకోవడంలో విఫలం అయ్యాడు. ‘రచ్చ’ తర్వాత పవన్‌ కళ్యాణ్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చాలా కాలం ఆలస్యం అయ్యింది. ఆ తర్వాత ఏవో కారణాల వల్ల ఈ సినిమా నుండి సంపత్‌ నంది తప్పించబడ్డాడు. దాంతో రవితేజతో ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రాన్ని చేయడం జరిగింది. రేపు ‘బెంగాల్‌ టైగర్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత తాను రామ్‌చరణ్‌తో సినిమా చేయాలని కోరుకుంటున్నట్లుగా సంపత్‌ నంది ప్రకటించాడు.

గతంలో చరణ్‌తో ‘చోటా మేస్త్రీ’ సినిమాను చేస్తాను అంటూ సంపత్‌ నంది ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ టైటిల్‌ను సైతం దర్శకుడు సంపత్‌ నంది రిజిస్ట్రర్‌ చేయించడం జరిగింది. దాంతో అప్పటి నుండే ఈ సినిమాపై చర్చ మొదలైంది. కాని మద్యలో సంపత్‌ నంది సైలెంట్‌ అవ్వడంతో సినిమాపై కూడా చర్చలు వినిపించలేదు. అయితే తాజాగా మరోసారి దర్శకుడు సంపత్‌ నంది తాను ఎట్టి పరిస్థితుల్లో ‘చోటా మేస్త్రీ’ సినిమా చేయాలని భావిస్తున్నాను అని, చరణ్‌తోనే ఆ సినిమా చేస్తాను అనే నమ్మకం తనపై తనకు ఉంది అని సంపత్‌ అన్నాడు. ‘బెంగాల్‌ టైగర్‌’ సక్సెస్‌ అయితే చరణ్‌ ఈయనకు అవకాశాలు ఇస్తాడని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Share
Published by

Recent Posts

Vijaya Sai New Party: But Who’s The CM?

After being a crucial member in the team of former CM YS Jagan for more…

17 minutes ago

RGV’s Scary AI Take: What Will Humans Do Next?

Ram Gopal Varma has once again raised a disturbing question about AI. And this time,…

37 minutes ago