Telugu

రాజకీయాల్లోకి సంపూర్ణేష్ బాబు… అధికారిక ప్రకటన..!

సినీ స్టార్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. అయితే ప్రేక్షకుల్లో ఓ స్థాయి గుర్తింపు ఉన్న వారు మాత్రమే ఎక్కువగా రాజకీయ రంగంలోకి అడుగు పెడుతుంటారు. సినీ సెలబ్రేటిలంటే ప్రేక్షకులకు ఉండే క్రేజ్ రీత్యా ఓట్లు రాలతాయనే ఉద్దేశమే వీరందరినీ రాజకీయాల వైపులు పరుగులు పెట్టిస్తోంది. అయితే తాజాగా ‘బర్నింగ్ స్టార్’ సంపూర్ణేష్ బాబు కూడా త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందని ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన చేసారు.

ADVERTISEMENT

ప్రస్తుతం “కొబ్బరిమట్ట” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంపూర్ణేష్ బాబు, రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ సందర్భంగా అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఇంటిలో బ్రేక్ ఫాస్ట్ చేసిన సంపూ, సదరు సమాచారాన్ని ట్విట్టర్ లో పెట్టారు.

‘కొబ్బరిమట్ట’ ఫైనల్ షెడ్యూల్ లో ఉన్నామని తెలుపుతూ చేసిన ఈ ట్వీట్ కు మరో సినీ వర్గీయుడు… ‘భవిష్యత్తులో రాజకీయ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా…?’ అంటూ సరదా ట్వీట్ చేసారు. అయితే దీనికి ప్రతిస్పందించిన బర్నింగ్ స్టార్… ‘త్వరలోనే ఉంటుంది సార్…’ అంటూ మరో సరదా వ్యాఖ్యలు చేసారు. ఇదంతా చూసిన వారు… ‘సంపూ దగ్గర సెన్స్ ఆఫ్ హ్యుమర్’ ఎక్కువే అంటున్నారు. ప్రస్తుతం సరదాకే అన్నా, ఒకవేళ నిజంగానే సంపూ రాజకీయ రంగ ప్రవేశం చేస్తే… ‘హృదయ కాలేయం’ మాదిరి అది కూడా ఒక సంచలనం అవుతుందేమో చూడాలి.

Share
Published by

Recent Posts

ఎలినో ఎఫెక్ట్ గణనాథుడిని కూడా తాకిందా.?

రాష్ట్రంలో ఎలినో ఎఫెక్ట్ ప్రజల పైనే కాదు ఆ దేవదేవుని పై కూడా పడిందా అన్నట్టుగా పరిస్థితులు దిగజారుతున్నాయి. ఎలినో…

29 minutes ago

Ramayana Won’t Be The Same For Everyone

Ramayana is not getting the same version for every audience. The English version of Ramayana:…

30 minutes ago