
గతంలో జోధా అక్బర్ సినిమాలో కూడా జోధాభాయ్ కథను వక్రీకరించాడని, అతనికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశ పూర్వకంగా దాడి చేశామని తెలిపారు. జర్మనీ వెళ్లి హిట్లర్ పై ఎవరైనా సినిమా తీయగలరా? సంజయ్ లీలా భన్సాలీకి ఎంత ధైర్యముంటే తమ ప్రాంతానికే వచ్చి రాణి పద్మావతి దేవి చరిత్రను వక్రీకరిస్తూ సినిమా తీస్తాడని మండిపడ్డారు. చరిత్రను వక్రీకరించి సినిమాలు తీస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తేల్చిచెప్పారు.
ఈ పరిణామాలతో సినిమా యూనిట్ మొత్తం షూటింగును రద్దు చేసుకుని ముంబైకి తిరుగు పయనమైంది. ఇదిలా ఉంటే, ప్రముఖ చరిత్రకారుడు ఎస్.ఇర్ఫాన్ హబీబ్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. అసలు చరిత్రలో పద్మావతి అనే రాణి లేదని బాంబు పేల్చారు. 1540లో మాలిక్ మహమ్మద్ జాయసి అనే కవి ‘పద్మావత్’ అన్న కావ్యంలో పద్మావతి అనే పాత్రని కల్పించారు. ఇది చారిత్రకంగా రుజువైన అంశమని అన్నారు.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…