
ఇంతలో షూటింగ్ స్పాట్ లోకి దూసుకొచ్చిన రాజ్ పుత్ కార్ణి సేన కార్యకర్తలు దర్శకుడి చెంపలు వాయించి, ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. రాజ్ పుత్ రాణిని హీనంగా చూపిస్తున్నారని, అల్లావుద్దీన్ ఖిల్జీతో రాణి పద్మావతి ప్రేమాయణం జరిపినట్టుగా చరిత్రను వక్రీకరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరి మధ్య ప్రేమాయణం సన్నివేశాలు తొలగించి, జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అకస్మాత్తుగా జరిగిన ఘటనతో సినిమా యూనిట్ మొత్తం బిత్తరపోయింది. కాగా, ఈ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ రణ్ వీర్ సింగ్, రాణి పద్మావతిగా అతని ప్రేయసి దీపికా పదుకొనే నటిస్తున్నారు. ‘పద్మావతి’ భర్తగా షాహిద్ కపూర్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సంచలనం రేపిన ఈ ఘటనతో బాలీవుడ్ ఒక్కసారిగా నివ్వెరపోయింది.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…