
సంక్రాంతి సినిమాల హంగామా మొదలు కావడానికి ఇంకా 10 రోజుల సమయం మిగిలి ఉంది. జనవరి 10వ తేదీన శంకర్ – రామ్ చరణ్ ల “గేమ్ చేంజర్”తో మొదలై, 12వ తేదీన బాలయ్య – బాబీల “డాకు mahaaraj” మరియు 14వ తేదీన అనిల్ – వెంకీల “సంక్రాంతికి వస్తున్నాం”తో థియేటర్లు నిండిపోనున్నాయి.
ఈ మూడు సినిమాలు విడుదలైన తర్వాత వచ్చే ప్రేక్షకాదరణ బట్టి ‘పొంగల్ విన్నర్’ ఎవరో నిర్ణయం అవుతుంది. అది పోస్ట్ రిలీజ్ కాగా, ప్రస్తుతం ప్రీ రిలీజ్ లో ఇప్పటికే ‘పొంగల్ విన్నర్’గా “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా నిలిచింది. ఈ సినిమా పాటలు, ప్రమోషన్స్ మిగిలిన రెండు సినిమాల కంటే ఎక్కువగా ప్రేక్షకుల ఆదరణ చూరగొంటోంది.
భీమ్స్ సంగీత సారధ్యంలో వచ్చిన మూడు పాటలు సంగీత ప్రియులను ఆకట్టుకోవడంలో విజయవంతం అయ్యాయి. ఒక్కో పాటకు ఒక్కో స్పెషల్ ను తీసుకువచ్చి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దర్శకుడు అనిల్ రావిపూడి తన చాకచక్యాన్ని ప్రదర్శించారని చెప్పడంలో సందేహం లేదు.
రమణగోగుల గాత్రంతో మొదలైన మొదటి పాట ఏకంగా 50 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోగా, మూడో పాటతో ఏకంగా విక్టరీ వెంకటేష్ నే రంగంలోకి దించాడు. ఫుల్ ఎనర్జిటిక్ తో వచ్చిన ‘బ్లాక్ బస్టర్ పొంగల్’ సాంగ్ న్యూ ఇయర్ హడావిడితో పాటు అసలు సిసలు రంగుల సంక్రాంతిని ప్రేక్షకుల కళ్ళ ముందుంచింది.
ఈ పాటలతో పాటు చిత్ర యూనిట్ సభ్యులతో కూడిన ప్రమోషన్స్ కూడా మిగిలిన రెండు సినిమాల కంటే ఎక్కువగా ప్రేక్షకులలోకి పోతున్నాయి. ఇప్పటికే పాటలపై పలు ఇంటర్వ్యూలుతో సందడి చేయగా, న్యూ ఇయర్ కానుకగా మరికొన్ని ప్రమోషన్ మెటీరియల్ ను చిత్ర యూనిట్ సిద్ధం చేసింది.
దీని వెనుక దర్శకుడు అనిల్ రావిపూడి సృజనాత్మకత స్పష్టంగా కనపడుతోంది. “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో థియేటర్లలో ఏ మాత్రం వినోదాన్ని అందిస్తారో గానీ, ప్రమోషన్స్ మాత్రం ఫుల్ ఎంటర్ టైనింగ్ గా సాగుతున్నాయి. ఇప్పటికే బాలయ్య ‘అన్ స్టాపబుల్’లో కూడా హీరో, హీరోయిన్లు, దర్శకుడు మెరిసి అలరించారు.
పండగకు వస్తున్న మూడు సినిమాలలో సేఫ్ ప్రాజెక్ట్ గా కనపడుతున్న “సంక్రాంతికి వస్తున్నాం” ధియేటిరికల్ ట్రైలర్ తర్వాత కూడా అదే హంగామాను కొనసాగిస్తుందో లేదో చూద్దాం. మళ్ళీ మూడు సినిమాల ట్రైలర్స్ విడుదలైన తర్వాత ఏ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందో మాట్లాడుకుందాం!
Rumours around the Allu Arjun-Lokesh Kanagaraj project just refuse to die down. A couple of…
A new pairing, a contemporary love story, and a team making its first steps into…