
ఈ సంక్రాంతి పండుగకు అరడజను సినిమాలు విడుదలవుతున్నాయి. వాటిలో 5 తెలుగు సినిమాలు, ఒక తమిళ డబ్బింగ్ సినిమా ఉన్నాయి.
జనవరి 9న ‘ది రాజా సాబ్’, విజయ్ దళపతి నటించిన జన నాయకుడు విడుదలవుతున్నాయి. జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు, జనవరి 13న రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి చేసేందుకు వస్తున్నారు.
జనవరి 14న ఉదయం ‘అనగనగా ఒక రాజుగారు’తో నవీన్ పోలిశెట్టి, సాయంత్రం నారీ నారీ నడుమ నలిగిపోతున్న మురారీ శర్వానంద్ వస్తున్నారు.
తెలుగువారి పండుగ సంక్రాంతికి తెలుగు సినిమాల విందు ఎలాగూ ఉంటుంది. వాటితో పాటు మద్రాస్ సాంబార్ గుమగుమలు కూడా తప్పనిసరి. అయితే ఈసారి మద్రాస్ సాంబార్ (జన నాయకుడు) బాగా పులిసిపోయిన వాసన వస్తోంది.
ఎందుకంటే, దాదాపు ఒకటిన్నరేళ్ళ క్రితం అంటే 2023, అక్టోబర్ 19న విడుదలైన నందమూరి బాలకృష్ణ సినిమా ‘భగవంత్ కేసరి’ని దీనిలో మక్కీమక్కీ దించేశారు. జన నాయకుడు ట్రైలర్ చూస్తే ఇది భగవంత్ కేసరికి రీమేకా? అని సందేహం కలుగుతుంది.
ఓ సినిమా ప్రేరణతో మరో సినిమా తీయడం సర్వసాధారణమే. కానీ ఇలా మక్కీకి మక్కీ దించేసి కొత్త సినిమా అంటే జనం నమ్ముతారా?
విజయ్ దళపతికి ఇదే చివరి సినిమా. దీంతో సినీ పరిశ్రమకి గుడ్ బై చెప్పేసి రాజకీయాలలోకి వెళ్ళిపోతున్నారు. క్రికెట్ నుంచి రిటైర్ కావాలనుకునేవారు తమ చివరి మ్యాచ్ సెంచరీతో ముగించాలనుకుంటారు. విజయ్ దళపతి సినీ కెరీర్ ముగింపు కూడా ఆవిధంగా ఘనంగా ఉంటుందనుకుంటే ఇలా చేసుకున్నారేమిటి? అని అనిపించక మానదు.
ఏది ఏమైనప్పటికీ సంక్రాంతి బరిలో కోడిపుంజులా దిగిన ‘జన నాయకుడు’, ఆట మొదలవక మునుపే తప్పుకున్నట్లు అనిపిస్తుంది.
ఎందుకంటే, మన రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు, మన భర్త మహాశయులు, మన మురారి, మన రాజుగారుని కాదని ఎవరూ పులిసిపోయిన మద్రాస్ సాంబార్ రుచి చూడాలనుకోరు కదా?
వైసీపీ హయంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూసి ప్రజలు లోలోన కుమిలిపోతున్న సమయంలోనే కేసీఆర్ హయంలో తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే…
The makers of Aakasamlo Oka Tara have announced November 20 as the film's official theatrical…