
అలా ఇప్పటిదాకా చాలా సార్లు జరిగింది. తాజాగా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గురించి కూడా ఇలాగే చెయ్యబోతున్నాడంట బన్నీ. సరిలేరు నీకెవ్వరూ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జనవరి 5న హైదరాబాద్ లో జరుగుతుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. దాని కోసం ఎల్బీ స్టేడియంని వేదికగా కూడా బుక్ చేసింది.
ఇప్పుడు అదే రోజున అదే సమయానికి బన్నీ తన అల వైకుంఠపురములో ప్రీ-రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో జరపాలని భావిస్తున్నాడట. త్వరలో అధికారిక ప్రకటన వెలువడబోతుంది. పాటలు, టీజర్ల వరకూ అంటే ఒక ఇంత పెద్ద ఈవెంట్లు క్లాష్ అంటే ఇబ్బందే. లక్షలు ఖర్చుపెట్టి చేసే ఈవెంట్లకు మైలేజ్ రాకపోతే ఇరు సినిమాలకు ఇబ్బందే.
ఒకే సమయంలో రెండు పెద్ద ఈవెంట్లు జరిగితే టీవీ రేటింగ్స్ కూడా తగ్గిపోతాయి. అది అల వైకుంఠపురములో కి కూడా మంచిది కాదు. దీనిపై ఆ చిత్రబృందం పునరాలోచించుకుంటే వారికే మంచిది. పైగా టీవీ వారు రైట్స్ కు ఇచ్చే సొమ్ములు కూడా తగ్గించేస్తారు.
Prabhas is undoubtedly one of the biggest superstars in Indian cinema. Since the release of…
Ishan Kishan's injury has created a playing opportunity for Vaibhav Sooryavanshi ahead of the second…