
అయితే పరిశీలకులు మాత్రం ఇద్దరిలో ఎవరో ఒకరు తప్పుకోవడం ఖాయమని, రెండు సినిమాలూ ఒకేరోజు వచ్చి ఇద్దరూ నష్టపోవడం అనేది జరగదని అంటున్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే… సంక్రాంతి ప్లానింగ్ గురించి రెండు చిత్రాల నిర్మాతలు ఇప్పటికే మాట్లాడుకున్నారట. అయితే ఇద్దరూ 12నే రావాలని పట్టుబట్టారట.
మహేష్ బాబు సినిమా నిర్మాతలు తాము 12న వస్తామని, మీరు 14న రమ్మని అలా వైకుంఠపురములో నిర్మాతలను రిక్వెస్ట్ చేశారట. 14 రిలీజ్ అంటే అమెరికాలో సోమవారం ప్రీమియర్లు జరుగుతాయి. అది నష్టం కావడంతో వారు ఇంట్రస్ట్ చూపించలేదు. అయితే ఈ డిస్కషన్స్ జరుగుతుండగానే బన్నీ సినిమా నిర్మాతలు తమ రిలీజ్ డేట్ 12 అని ప్రకటించేశారు.
దీనితో తాడోపేడో తేల్చుకోవాలని సరిలేరు నీకెవ్వరు నిర్మాతలు కూడా అదే డేట్ అనౌన్స్ చేసేశారు. మరి ఇద్దరిలో ఎవరు ఇప్పుడు వెనుతిరుగుతారో చూడాలి. సహజంగా బన్నీ వెనక్కు తగ్గుతాడని అందరూ భావించవచ్చు. అయితే ఈ విషయంలో మాత్రం మొదట విడుదల తేదీని ప్రకటించి మోరల్ గా తనే ముందు వచ్చా అనిపించుకున్నాడు
Bhagyashri Borse walks into this gallery with the kind of quiet fire that instantly lifts…
Nani’s The Paradise is back in the news, but this time for a different reason.…