
ఇదే వరసలో అందాల రాముడు చిత్రంతో భీమ వరం కుర్రాడు సునీల్ కూడా హీరో అవతారం ఎత్తాడు . ఆ తరువాత ఆఫర్స్ పెద్దగా రాలేదు. అయితే `ఈగ` చిత్రం తరువాత రాజమౌళి సరదగా స్టార్ హీరోలతో చేయకుండా.. ఒక ఇమేజ్ లేని నటుడితో సినిమా చేద్దామని చేసిన చిత్రం మర్యాద రామన్న.
సునీల్ ను హీరోగా ఎస్టాబ్లీష్ చేసింది. ఆ తరువాత వీరభద్రమ్ అనే దర్శకుడు సునీల్ తో చేసిన `పూల రంగడు` చిత్రం ఘన విజయం సాధించింది. దీంతో సునీల్ ఇతర చిత్రాల్లో కమెడియన్ గా నటించడం మానేసి..పూర్తి స్థాయి హీరోగా చేయడానికి డిసైడ్ అయ్యాడు. అంతే వరస ప్లాప్స్… కట్ చేస్తే సునీల్ కెరీర్ డైలామా లో పడింది. నిదానంగా తన ప్లేస్ ను ఇతర కమెడియన్స్ కవర్ చేసేశారు. ఇప్పుడు సునీల్ పరిస్థితి ముందు నుయ్యి ..వెనక గొయ్యి అన్న చందంగా తయారైంది.
అయితే సప్తగిరి మాత్రం ఒక కమెడియన్ కెరీర్ ఎలా వుంటుందో అనే విషయం సునీల్ ను చూసి బాగానే తెలుసుకున్నట్లున్నాడు. తను డెబ్యూ హీరోగా పరిచయం అయిన చిత్రం `సప్తగిరి ఎక్స్ ప్రెస్` ఒక మాదిరిగా నడిచింది. అదే సినిమా నిర్మాత తో తాజాగా `సప్తగిరి ఎల్ ఎల్ బి` చిత్రం చేశాడు.తను కేవలం హీరో గా మాత్రమే కాదు.. అవకాశం వచ్చినప్పుడు మాత్రమే హీరోగా చేస్తూ… మిగిలిన సమయంలో యధా విధిగా కమెడియన్ గా ఇతర చిత్రాలు చేస్తున్నట్లు పప్తగిరి ఓపెన్ గానే చెప్పాడు. దీంతో తన సహ కమెడియన్ సునీల్ ను చూసి సప్తగిరి ముందుగానే మెల్కొన్నట్లు అయ్యింది కదా.! ఏది ఏమైనా సప్తగిరి తీసుకున్న నిర్ణయం సరైందే మరి!.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…