ఏపీలో జరగనున్న “మెగా మూవీ” ఆడియో వేడుక!

ఇప్పటికే లీకైన పాటతో అంచనాలు పెరిగిన “సరైనోడు” సినిమా ఆడియోను వినూత్నంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఆడియో వేడుకలకు అడ్డా అయినటువంటి హైదరాబాద్ లో కాకుండా కాస్త డిఫరెంట్ గా విశాఖపట్నం వేదికగా “సరైనోడు” వేడుకను అంగరంగ వైభవంగా జరపాలని నిర్మాత అల్లు అరవింద్ భావిస్తున్నారని ట్రేడ్ వర్గాల సమాచారం.

ఇటీవల కాలంలో మెగా సినిమాల వేడుకలు బహిరంగ ప్రదేశంలో జరిపిన దాఖలాలు లేకపోవడంతో, “సరైనోడు” ద్వారా మెగా బలాన్ని చాటి చెప్పినట్లయితే అది సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావితం చూపుతుందని చిత్ర యూనిట్ ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచడంతో, ఆడియోను మునుపెన్నడూ లేని విధంగా విడుదల చేసి అల్లు అర్జున్ కు సూపర్ స్టార్ డంను తెచ్చిపెట్టాలనే యోచనలో తండ్రి అల్లు అరవింద్ పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని టాక్.

ADVERTISEMENT

ప్రస్తుతానికి వెన్యూ నిర్ణయం కానప్పటికీ, విశాఖలోని ఏదైనా బహిరంగ ప్రదేశంలోనే “సరైనోడు” ఆడియో వేడుకను నిర్వహించబోతున్నారని సమాచారం. వరుసగా “సర్ధార్ గబ్బర్ సింగ్, సరైనోడు” ఆడియో వేడుకల సమాచారంతో మెగా అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది.

Share
Published by

Recent Posts

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

1 hour ago

Sardar 2: Can Karthi Survive the Deadly Mandaadi Clash?

Following the terrible failure of Vaa Vaathiyaar, Karthi is all set to return with his…

2 hours ago