Telugu

“సర్ధార్” కటౌట్లతో నిండిపోతున్న ధియేటర్ల గోడలు!

తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణాలలోనే కాదు, పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలలోనూ ప్రస్తుతం ఏ ధియేటర్ పరిస్థితి చూసినా ఇదే… ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ కటౌట్లతో ధియేటర్ల గోడలు నిండిపోతున్నాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్ చేస్తున్న హంగామాతో ధియేటర్లు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి.

ADVERTISEMENT

‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ ఫుల్ లెంగ్త్ లో నటించిన సినిమా కావడంతో అభిమానుల ఉత్సాహం ఉరకలేస్తోంది. దీనికి తోడు ‘రత్నాపూర్ కా సర్ధార్’గా పవన్ రచ్చ రంబోలా చేసాడనే టాక్ హల్చల్ చేస్తుండడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. మరో వైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.

“వీడు అందరి లాంటి మనిషి కాదు… ఈ జనంలో నుండి పుట్టిన ఐడియాలజీ…” అంటూ విలన్ పవన్ ను కీర్తిస్తూ చెప్తున్న డైలాగ్స్ టీజర్లు పవన్ పొలిటికల్ డైలాగ్స్ ను టచ్ చేసినట్లుగా స్పష్టమవుతోంది. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ ముందు పవర్ స్టార్ కూడా ఫ్యాన్స్ ను ఉత్సాహపరిచే పొలిటికల్ డైలాగ్స్ చెప్పినట్లు తెలుస్తోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

నిర్మాతల మండలి ఎన్నికల్లో ‘మన ప్యానెల్’ హవా..

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో సి.కల్యాణ్ నేతృత్వంలోని ‘మన ప్యానెల్’ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. అధ్యక్షుడిగా సి.కల్యాణ్ ముందుగానే…

12 minutes ago

US Huge Scam: FBI Arrests Most Wanted Indian Kirana Owner

An Indian-origin man accused of defrauding the US government of at least $600,000 has been…

13 minutes ago