Telugu

చిలక పలుకులు పలికిన ‘సర్ధార్’ బ్యూటీ!

ప్రస్తుతం “సర్ధార్ గబ్బర్ సింగ్” చిత్రం ద్వారా ధియేటర్లలో సందడి చేస్తున్న ‘చందమామ’ కాజల్, ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మీడియా ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలో తాజాగా చెప్పిన అనుభూతులు… కాజల్ మాటల్లోనే…

సినీ రంగంలోకి వచ్చిన మొదట్లో దర్శకుడు ఎలా చెబితే అలా చేసే దానిని, అయితే అప్పట్లోలా ఇప్పుడు చేయడం లేదని, ఫలానా సన్నివేశం గురించి దర్శకుడు కొంత పాయింట్ వరకే చెబుతారని, ఆ తర్వాత వెండితెరపై దానిని సంతృప్తికరంగా అమలు చేసే బాధ్యతను తానే తీసుకుంటున్నానని తెలిపింది. సినీ పరిశ్రమలో తనకు స్నేహితులు మాత్రమే ఉన్నారని, మంచి స్నేహితులు ఎవరూ లేరని చెప్పింది.

ADVERTISEMENT

ఇక, పారితోషికం విషయంలో కూడా ఓ స్పష్టమైన అభిప్రాయం వ్యక్తపరచడం విశేషం. “తాను డిమాండ్ చేసినంత రెమ్యూనరేషన్ ఇవ్వకపోతే సినిమాలు అంగీకరించనని, తనకు కావాలనేది తానే డిసైడ్ చేస్తానని చెప్పింది. అలాగే ఎవరితో నటిస్తున్నాను, సినిమా ఎలా ఉంటుందనేది అనే సంగతులు కూడా తానే చూసుకుంటానని ఈ ‘చందమామ’ చిలకపలుకులు పలికింది.

తెలుగు, తమిళం, హిందీ… భాష ఏదైనా, పరిశ్రమ ఏదైనా చేసే పనంతా ఒక్కటేనని… ప్రాంతాల వారీగా భాష, సంస్కృతి, సంప్రదాయాలు మాత్రమే మారతాయని, తానేం చేయాలనుకుంటున్నానో, ఏం చేస్తున్నాననో తనకు పూర్తి అవగాహన ఉంటుందని చెప్పిన కాజల్, ఎవరేమన్నా, ఏమనుకున్నా వాటిని పట్టించుకోవడం, ప్రాధాన్యత ఇవ్వడం జరగదని చెప్పుకొచ్చింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Toughest Test for a Star Kid in the Social Media Era?

Nandamuri Balakrishna has finally confirmed the debut film of his son, Nandamuri Mokshagna. The project…

3 minutes ago

Pics: Nandamuri Mokshagna’s Debut Announced

Pics: Nandamuri Mokshagna’s Debut Announced

11 minutes ago