
చిత్రం: సర్దార్ 2
M9 రేటింగ్: 1.25/5
విడుదల తేదీ: సెప్టెంబర్ 10, 2026
తారాగణం: కార్తీ, మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్, ఎస్.జే.సూర్య తదితరులు
నిర్మాణ సంస్థ: ప్రిన్స్ పిక్చర్స్ – ఐవీ ఎంటర్టైన్మెంట్స్
దర్శకత్వం: పి.ఎస్.మిత్రన్
సంగీతం: సామ్.సి.ఎస్
నిర్మాత: ఎస్.లక్ష్మణ్ కుమార్ – ఇషాన్ సక్సేనా
ఛాయాగ్రహణం: జార్జ్ సి.విలియమ్స్
కూర్పు: విజయ్ వేల్కుట్టి
2022 లో విడుదలై యావరేజ్ టాక్ సంపాదించుకున్న “సర్దార్”కి సీక్వెల్ గా వచ్చిన సినిమా “సర్దార్ 2”. కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం సీక్వెల్ ఆడియన్స్ లో పెద్దగా క్యూరియాసిటీ బిల్డ్ చేయలేకపోయింది. మరి సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంది? అనేది చూద్దాం..!!
కథ:
బ్లాక్ డాగర్ అనే మాఫియా సంస్థ ఇండియన్ రా ఏజెంట్స్ ని టార్గెట్ చేసి చంపుతూ ఉంటుంది. ఏజెంట్ జారా (మాళవిక మోహనన్) హత్యతో విషయం సీరియస్ అవుతుంది.
అసలు బ్లాక్ డాగర్ ఏజెన్సీకి రా ఏజెంట్స్ తో పనేంటి? ఆపరేషన్ DOKU ఏంటి? దాని వల్ల దేశానికి నష్టం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం కోసం సర్దార్ (కార్తీ), విజ్జీ (కార్తీ) కలిసి చేసిన ఆపరేషనే “సర్దార్ 2” చిత్రం.
నటీనటుల పనితీరు:
కార్తీ ఎప్పట్లానే డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో అలరించాడు. అయితే.. రెండు వేరియేషన్స్ లోనూ చెప్పుకోదగ్గ మూమెంట్స్ ఏమీ లేకపోవడం గమనార్హం.
మాళవిక మోహనన్, ఆషిక రంగనాథ్, అచ్యుత్ కుమార్ వంటి ఆర్టిస్టులందరూ ఉన్నారంటే ఉన్నారు అనిపించుకున్నారు.
ఎస్.జే.సూర్య డ్రెస్సింగ్ స్టైల్ మారుతుంది కానీ.. అదే ఫార్మాట్ యాక్టింగ్ తో బోర్ కొట్టేస్తున్నాడు. ఇలాగే కంటిన్యూ ఐతే నటుడిగా అతడ్ని పక్కన పెట్టేస్తారు. అతడు పోషించిన యోగానందం అనే పాత్రకి డెప్త్ ఉన్నప్పటికీ.. దాని ఆర్క్ ని సరిగా వాడుకోలేదు.
సాంకేతికవర్గం పనితీరు:
జార్జ్ సి.విలియమ్స్ లాంటి సినిమాటోగ్రాఫర్ ని పెట్టుకుని కూడా AI ఫుటేజ్ వాడడం అనేది బాధాకరం. అది కూడా కార్ ఛేజ్ అండ్ డ్రైవింగ్ సీక్వెన్సులకి. గ్రాఫిక్స్ కూడా చాలా పేలవంగా ఉన్నాయి. ఫ్లైట్ లో యాక్షన్ సీన్ లో గ్రాఫిక్స్ చూసి జనాలు నవ్వుకుంటారు. ఈమధ్యకాలంలో ఒక మీడియం హీరో సినిమాలో ఈ స్థాయి పేలవమైన వర్క్ చూడలేదు.
సామ్ సి.ఎస్ కి మిషన్ ఇంపాజబుల్ లాంటి బ్యాగ్రౌండ్ స్కోర్ కొట్టమని అడిగి ఉంటారు, అతను అలాంటిది ఎందుకు అనుకుని, అదే కొట్టేసాడు. ఒక్క సీన్ కూడా సామ్ బీజీఎం వల్ల వర్కవుట్ అవ్వలేదు.
డైరెక్టర్ మిత్రన్ తన ఫార్మాట్ లో జనాల్లో ఒక భయాన్ని, బాధ్యతని కలిగిద్దామనుకున్నాడు. ఈసారి ఎంచుకున్న టాపిక్ యాంటీ బయోటిక్స్ యూసేజ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల నష్టాలు అనేవి జనాలకి చెప్దాం అనుకున్నాడు. “అభిమన్యుడు”లో డాటా చోరీ ఎలా జరుగుతుంది అని మిత్రన్ వివరించినప్పుడు నిజంగానే భయం వేసింది, “హీరో” సినిమాలో పేటెంట్ హక్కుల కోసం బడా వ్యాపారస్తులు ఎంతటి ఘోరాలకు పాల్పడుతున్నారు అని చూపించినప్పుడు ఒళ్లు జలదరించింది. కానీ.. “సర్దార్”లో వాటర్ బాటిల్ వల్ల హానికి కాస్త జడిసారు. అయితే.. “సర్దార్ 2”లో మాత్రం ఆ ఇంపాక్ట్ లేదు. చెప్పే విషయాన్ని కానీ, ఆ తీవ్రతను కూడా సరిగా చూపించలేదు. అందువల్ల అది పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఇక మిషన్ ఇంపాజబుల్ రేంజ్ లో చెప్పాలనుకుని, ఏదో పేరడీ తీసినట్లుగా ఉంటాయి ఆ జపాన్, చైనా ఎపిసోడ్స్. ఇక ఆడియన్స్ ని కాస్త నవ్వించడం కోసం ఇరికించిన కామెడీ సీన్స్ అయితే.. ఉన్న సహనాన్ని పరీక్షిస్తాయి. కథకుడిగా, దర్శకుడిగా మిత్రన్ ఈసారి మాత్రం దారుణంగా విఫలమయ్యాడు.
విశ్లేషణ:
ఒక సీరియస్ విషయాన్ని తీసుకుని, ఆ విషయాన్ని అంతే సీరియస్ గా చెప్పాలి. అందుకోసం ఎంచుకున్న జానర్-థీమ్ ని కూడా నిజాయితీగా చూపించాలి. అంతేకానీ AI వాడేసి, కన్వీనియంట్ గా సీన్స్ రాసేసుకుని.. దాన్ని పెద్ద థ్రిల్లర్ లా చూపించాలనుకోవడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. “సర్దార్ 2” అవుట్ రైట్ బ్యాడ్ ఫిలిం. ఒక్కటంటే ఒక్క సీన్ వర్కవుట్ అవ్వలేదు. ఎమోషన్ కోసం వెతికినా దొరకదు. ఇచ్చిన మెసేజ్ కూడా విలన్ తో ఇప్పించడం అనేది కొత్త ఆలోచన అయినప్పటికీ.. ఎగ్జిక్యూషన్ వరస్ట్ గా ఉంది. ఇక కార్తీకి హిట్ ఇవ్వాల్సిన బాధ్యత కళ్యాణ్ శంకర్ మీదే ఉంది.
ఓవరాల్ గా.. సరుకు లేని సినిమా!
M9 రేటింగ్: 1.25/5
Revanth Reddy has been maintaining an active person on social media for a long time…
Prabhas and Sandeep Reddy Vanga’s Spirit has been grabbing attention with its casting updates and…