
ఇటీవల ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో కూటమి సంయుక్త సమావేశంలో సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. వారి వెనుక కూటమి పార్టీల ఉమ్మడి లోగో, పక్కనే ‘చెప్పిందే చేస్తాం’ అని వ్రాసున్న బ్యానర్ ఉంది.
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నేరవేర్చుతూనే ఉంది. అలాగే ఫలానా అభివృద్ధి పనులు లేదా ఫలానా రోజున జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్తే ఆ రోజున తప్పకుండా చేస్తున్నారు. కనుక ‘చెప్పిందే చేస్తాం’ అని వ్రాసుకోవడం సహేతుకమే.
అయితే కూటమి ప్రభుత్వం మాత్రమే కాదు వైసీపీ కూడా చెప్పిందే చేస్తోంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో అల్లర్లు, దౌర్జన్యాలు జరుగుతాయని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముందే చెప్పారు. కాకపోతే వాటిని సిఎం చంద్రబాబు నాయుడుకు ఆపాదించి చెప్పారు అంతే! జగన్ మాట తప్పని మడమ తిప్పని మనిషి. కనుక ఆయన చెప్పినట్లుగానే వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. వారిని అడ్డుకునే ప్రయత్నంలో టీడీపి శ్రేణులు కూడా రెచ్చిపోయాయి. నామినేషన్స్ ప్రక్రియలో అల్లర్లు జరిగాయి.
తాజాగా తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ రోజు (నవంబర్ 1)న రిగ్గింగ్ జరుగబోతోందని ఆరోపిస్తూ జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన అభినయ్ రెడ్డి అధ్వర్యంలో మేయర్ అభ్యర్ధి వాసుదేవ యాదవ్, కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్ధులు తిరుపతిలో ధర్నా చేశారు.
టీడీపి అభ్యర్ధులు గూండాలను తీసుకువచ్చి ఓటర్లను భయపెట్టి రిగ్గింగ్ చేస్తారని, కనుక అటువంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా, జిల్లా ఎస్పీ, పోలీస్, ఎన్నికల అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఒకవేళ వారుకూడా పక్షపాతంగా వ్యవహరిస్తూ రిగ్గింగ్ చేసేందుకు తోడ్పడితే, ప్రతీ ఒక్కరినీ కోర్టుకీడ్చుతామని వైసీపీ రిజినల్ కో-ఆర్డినేటర్ భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు.
టీడీపీ గూండాలను దించి రిగ్గింగ్‌కు పాల్పడుతుందని వైసీపీ ముందస్తు ధర్నా చేయడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు జిల్లాల నుంచి, చెన్నై నుంచి కూడా బస్సులలో జనాలను తీసుకువచ్చి దొంగ ఓట్లు వేసినట్లు వార్తలు వచ్చాయి.
వైసీపీ నేతలు ఆ మధుర స్మృతులన్నీ మరిచిపోయినా, అలాంటి ఆలోచనలు వారిని వీడలేదని సూచిస్తున్నట్లే ఉంది ఈ ధర్నా!
కనుక వైసీపీ కూడా ‘చెప్పిందే చేస్తాం’ అంటున్నట్లు భావించి, వారు కోరినట్లుగానే ‘ఎవరూ రిగ్గింగ్ చేయకుండా’ ఎన్నికల అధికారులు, పోలీసులు అవసరమైన చర్యలు చేపట్టడం అవసరమే.
ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు సైతం చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయని అందరికీ తెలుసు. కనుక ఎన్నికల బరిలో దిగిన అభ్యర్ధులు…
Trivikram Srinivas’ playful moment with Srinidhi Shetty at the Aadarsha Kutumbam: House No. 47 pre-release…