
గతంలో సినిమా రిలీజ్ డేట్ల పై వివాదం ఏర్పడినప్పుడు ఇరు చిత్రాల బృందాలు కూర్చుని మాట్లాడుకుని… సరిలేరు నీకెవ్వరూ 11న, అల వైకుంఠపురంలో 12న రావాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు బన్నీ షాక్ ఇస్తున్నాడనే చెప్పుకోవాలి. దీనిపై సరిలేరు నీకెవ్వరూ టీం సీరియస్ అయినట్టు తెలుస్తుంది.
ముందు అనుకున్నట్టు 12న వస్తే పర్లేదు… ముందుకు జరిగితే మాత్రమే అదే రోజున మేము కూడా వస్తాం అంటున్నారట. దీనితో న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన రెండు సినిమాల కొత్త పోస్టర్ల మీద విడుదల తేదీలు వెయ్యలేదు. ఒకవేళ ఈ రెండు సినిమాలు గనుక క్లాష్ అయ్యి 10న వస్తే, కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా సినిమా 12న రావాలని అనుకుంటుంది.
దీనితో కథ ముందుకు వచ్చినట్టు అయ్యింది. ఈ రెండు సినిమాలు గనుక 10న వస్తే 9న విడుదల కాబోయే రజినీకాంత్ దర్బార్ కు కొంచెం ఇబ్బందే. బన్నీ ప్రస్తుతం కొత్త సంవత్సరం సెలెబ్రేషన్స్ కోసం బ్యాంగ్ కాక్ వెళ్ళాడు. ఆయన తిరిగివచ్చాకా రిలీజ్ డేట్లపై క్లారిటీ రావొచ్చు.
In under three weeks from now, Ram Charan will be returning to the big screen…
తమిళ నటుడు సూర్యని ముద్దుగా సేవియర్ సూర్య అని పిలుస్తూ ఉంటారు సినిమా అభిమానులు. ఎందుకంటే.. ప్రతి సినిమాలో సూర్య…