Telugu

బుల్లితెర మీద మరోసారి సత్తా చూపిన మహేష్ బాబు

What-to-Watch---Mahesh-Babu's-Strong-Recommendationసూపర్ స్టార్ మహేష్ బాబుకు టెలివిజన్ ప్రేక్షకులతో అపూర్వమైన ఫాలోయింగ్ ఉంది. తన ఇటీవలి బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరూ యొక్క టీవీఆర్ రేటింగ్స్ దీనికి ఉదాహరణ. ఈ చిత్రం ఇంతకుముందు ప్రపంచవ్యాప్త టెలివిజన్ ప్రీమియర్ జరిగినప్పుడు 23.04 టివిఆర్ రేటింగ్స్ సాధించింది.

సాధారణంగా, ఏదైనా సినిమా టీవీఆర్ రేటింగ్స్ రెండవ టెలికాస్ట్ సమయంలో సగం లేదా అంతకంటే తక్కువగా ఉంటాయి. కానీ సరిలేరు నీకెవ్వరూ విషయంలో అలా కాదు. ఈ చిత్రం రెండవ టెలికాస్ట్‌లో 17.4 టివిఆర్ రేటింగ్స్ పొందింది. ఈ రేటింగ్ అనేక స్టార్ చిత్రాల ప్రపంచవ్యాప్త టెలివిజన్ ప్రీమియర్స్ కంటే ఎక్కువ.

ADVERTISEMENT

టెలివిజన్ ఆడియన్స్ మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో మహేష్ బాబు కు ఉన్న అపూర్వమైన ఫాలోయింగ్ ని ఇది సూచిస్తుంది. ఈ సినిమా యొక్క అధికారిక బ్రాడ్‌కాస్టర్ జెమిని టివి ఉబ్బితబ్బిబవుతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోవైపు, మహేష్ బాబు కరోనా కేసులు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నాడు.

తగ్గాకే గీతా గోవిందమ్ ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న తన తదుపరి చిత్రం సర్కారు వారి పాట షూటింగ్ ప్రారంభిస్తాడు. గత వారం టెలికాస్ట్ చేసిన ఇతర చిత్రాలగురించి చూస్తే… దుల్కర్ సల్మాన్ యొక్క కనులు కనులు దోచాయంటే మొట్టమొదటి సారిగా ప్రసారమయ్యి 7.1 టివిఆర్ రేటింగ్‌ను రికార్డ్ చేసింది. ఒక డబ్బింగ్ సినిమాకు ఇది డీసెంట్ అనే చెప్పుకోవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Rahul Sankrityan: Ranabaali Puts a Big Question Mark!

Rahul Sankrityan made a promising debut with Taxiwaala, starring Vijay Deverakonda. He followed it up…

2 minutes ago

Pics: Saanve Makes Traditional Glam Feel Fresh!

Saanve Megghana knows how to make traditional dressing feel fresh. In this striking photo series,…

22 minutes ago