
పార్టీ అధినేత్రిగా పగ్గాలు చేపట్టే క్రమంలో శశికళ వర్గం అనేక జాగ్రత్తలు తీసుకుంది. ఈ రోజు జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో… శశికళకు ఇబ్బంది కలిగేలా కొంచెం కూడా వ్యతిరేకత కనపడకపోవడం అందరికీ షాక్ ను ఇచ్చింది. ఈ భేటీకి 2200 మందిని మాత్రమే ఆహ్వానం అందగా, శశికళపై వ్యతిరేక వర్గీయులకు ఆహ్వానం అందలేదు. అలాగే, వారిని పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. కేవలం ఇన్విటేషన్ ఉన్న వారు మాత్రమే పార్టీ కార్యాలయంలోకి వచ్చేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తానని ఎంపీ శశికళ పుష్ప ప్రకటించడంతో… శశికళ వర్గం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బుధవారం నాడు పార్టీ కార్యాలయానికి వచ్చిన శశికళ పుష్ప భర్త లింగేశ్వరన్ తిలకన్ పై శశి వర్గం తీవ్రంగా దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టి, బయటకు తరిమేసింది. ఈ వ్యవహారంతో, తమ వ్యతిరేక వర్గాలను భయభ్రాంతులకు గురి చేసింది. సర్వసభ్య సమావేశం సందర్భంగా కూడా కొంత మేర వాడీవేడిగా జరిగినా, చివరకు శశికళ పార్టీ అధినేత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Ram Charan and his family celebrated Sri Krishna Janmashtami at home. A picture from their…
Toxic has emerged as a big disaster at the box office. The movie had a…