Telugu

పేరుకు పెరోల్…. చేసేది మాత్రం..?

జ‌య‌లలిత చ‌నిపోయిన నాటి నుంచి త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో రోజుకో ప‌రిణామం చోటు చేసుకుంటోంది. శ‌శిక‌ళ జైలుకెళ్ల‌డం, ప‌ళ‌నిస్వామి, ప‌న్నీర్ సెల్వం క‌లిసిపోవ‌డం, టీటీవీ దిన‌క‌ర‌న్ ప్ర‌భుత్వ వ్య‌తిరేక కార్య‌కలాపాలు చేస్తుండ‌టం… ఇలా ప్ర‌తి ఒక్క‌టీ త‌మిళ రాజ‌కీయాల‌ను వార్త‌ల్లో నిలిచేలా చేస్తున్నాయి. ఇటీవ‌ల పెరోల్ మీద శ‌శిక‌ళ బ‌య‌టికి రావ‌డంతో రాజ‌కీయాల్లో ఎలాంటి కొత్త ప‌రిణామం జ‌రుగుతుందోన‌ని త‌మిళులు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు.

దిన‌క‌ర‌న్ చెప్పిన‌ట్లుగా అధికార ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఓటు వేసే స్లీప‌ర్ సెల్స్ ఇప్పుడు బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉందేమోన‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. తాజాగా మంత్రి సెల్లూర్‌ రాజు చేసిన వ్యాఖ్యలు వారి అభిప్రాయానికి బ‌లం చేకూరుస్తున్నాయి. తాను స్లీపర్‌ సెల్‌ కాదని సెల్లూర్ రాజ్ స్ప‌ష్టం చేయ‌డంతో నిజంగానే స్లీప‌ర్ సెల్స్ ఉండి ఉంటార‌ని అనుమానిస్తున్నారు. అవసరమైనప్పుడు తమకు అనుకూలంగా 60 మంది ఎమ్మెల్యేలు వస్తారని, వారంతా ముఖ్యమంత్రి వర్గంలోనే ఉన్నారని టీటీవీ దినకరన్ చెప్పిన మాట‌లు నిజ‌మ‌య్యే సూచ‌న‌లు ఉన్నాయని త‌మిళులు భావిస్తున్నారు.

ADVERTISEMENT

వారు భావించిన‌ట్లుగానే శ‌శిక‌ళ చెన్నైకి వచ్చినప్పటి నుంచి అధికార పార్టీలోని నాయకులలో ముఖ్యంగా శశికళ, టీటీవీ దినకరన్‌ మద్దతుదారుల్లో ఉత్సాహాం క‌నిపిస్తోంది. పెరోల్‌ నిబంధనలు అడ్డువస్తున్నప్పటికీ ఆమెతో భేటీ కావడానికి కూడా కొంతమంది ప్రయత్నిస్తున్నారు. నివాసం, ఆసుప‌త్రి కేంద్రాలుగా శశిక‌ళ‌ రాజకీయ వ్య‌వ‌హారాలు కొన‌సాగిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై తమ మద్దతుదారులకు శశికళ దిశానిర్దేశం చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.

మంగళవారంతో పెరోల్‌ గడువు ముగియనుండటంతో ఆలోపు తన ఆలోచనలకు తుది రూపం తీసుకురావాలని శశికళ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే ఆమె తిరిగి జైలుకు వెళ్లేలోపు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ కొనసాగుతోంది. పెరోల్‌ గడువు మంగళవారం ముగియనున్న నేపథ్యంలో పళనిస్వామి వర్గం నుంచి ఎవరైనా నోరు విప్పుతారా? శశికళ తిరిగి వెళుతూ రాజకీయాలను ఏదైనా అనూహ్య మలుపు తిప్పుతారా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

ఇదిలా ఉండగా కేవ‌లం ఆస్తి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికే శశికళ పెరోల్‌పై బయటకు వచ్చారని మంత్రి జయకుమార్ ఆరోపించారు. తమ ప్రభుత్వం ఏర్పడటానికి శశికళ కారణమని చెప్పిన మంత్రి సెల్లూరు రాజు వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు. దినకరన్‌ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని పేర్కొన్నారు. మ‌రో ప‌క్క భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై కూడా శ‌శిక‌ళ పెరోల్‌పై బ‌య‌ట‌కు రావ‌డంపై స్పందించారు. ఆమెకు పెరోల్ ఇవ్వటంలో నిబంధనల అతిక్రమణ జరిగిందని ఆమె ఆరోపించారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

నారా లోకేష్‌ సూటి ప్రశ్నలు సమాధానం ఉందా?

పులివెందులలో జరిగిన అల్లర్లు, పోలింగ్ సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై మంత్రి నారా లోకేష్‌ స్పందిస్తూ, వైసీపీ అధినేత జగన్మోహన్…

5 minutes ago

జగన్‌ రాజకీయాలు ఇలాగే ఉంటాయి: ఎమ్మెల్యే పుత్తా

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తప్పదని జగన్ ముందే చెప్పుకున్నారు. అయితే, ఆ నెపాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పైకి…

21 minutes ago