
పులివెందులలో జరిగిన అల్లర్లు, పోలింగ్ సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రెండు సూటి ప్రశ్నలు వేశారు.
“అటు శ్రీకాకుళం నుంచి ఇటు కుప్పం వరకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రమంతటా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. కానీ ఒక్క పులివెందులలోనే అల్లర్లుఎందుకు జరుగుతున్నాయి?
వైసిపి ఓడిపోతుందని జగన్‌కు ముందే తెలుసు. అందుకే ఆయన బెంగళూరులో కూర్చొని ఇక్కడ ఇంత విధ్వంసం సృష్టించారు.
ఈరోజు హెలికాఫ్టర్‌లో వచ్చినప్పుడు కూడా తనను చంపేయడానికి మేము కుట్ర చేశామంటూ దుష్ప్రచారం చేయించారు. దాంతో ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నించారు.
కానీ ఇన్నేళ్ళ తర్వాత తొలిసారిగా పులివెందుల ప్రజలకు ధైర్యంగా ఓట్లు వేసేందుకు అవకాశం కల్పించింది మా ప్రభుత్వమే కదా?మీరు మా ప్రభుత్వం, పార్టీపై ఎంతగా దుష్ప్రచారం చేసినా అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలకు అక్కడ ఎవరి పాత్ర ఏమిటో బాగా తెలుసు,” అని మంత్రి నారా లోకేష్ అన్నారు.
ఏకగ్రీవాలపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారానికి కూడా మంత్రి నారా లోకేష్ ధీటుగా జవాబు చెప్పారు. “నాడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు పులివెందులలో మొత్తం అన్ని వార్డులు ఏకగ్రీవం అయ్యాయని ఆయనే గొప్పగా చెప్పుకున్నారు కదా?
అప్పుడు ఏకగ్రీవాలు ఎలా అయ్యాయి? అప్పుడు తప్పు కానప్పుడు ఇప్పుడు ఏకగ్రీవాలు ఎలా తప్పు అవుతాయి? అయినా మేమేమీ ఏకగ్రీవాల కోసం ఆరాటపడలేదు. వైసీపీ వాళ్ళు కూడా నామినేషన్స్ వేసేందుకు సహకరించి, వారితో పోటీకి సిద్ధం అయ్యాము. కానీ మేము నామినేషన్స్ వేయకుండా అడ్డుకున్నామని జగన్ వితండవాదం చేస్తున్నారు,” అని మంత్రి నారా లోకేష్ అన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు ఇటీవల చెప్పుకున్న ఓ మాట ఇప్పుడు గుర్తు చేసుకోవడం అవసరం.
“అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం డబ్బంతా ఖర్చు చేశాము. కానీ ఓడిపోయాము. ఇప్పుడు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మా దగ్గర డబ్బు లేదు. అయినా పోటీ చేస్తున్నాము,” అని అసలు కారణం బయట పెట్టారు.
ఓడిపోయే ఈ ఎన్నికల్లో డబ్బు వృధా చేసుకోవడం దేనికని వైసీపీలో టికెట్స్ ఇస్తామన్నా చాలా మంది తీసుకోలేదు. కనుక నామినేషన్స్ వేయడానికి చాలా మంది ముందుకు రాలేదని అర్ధమవుతోంది. కానీ వైసీపీ అభ్యర్ధులను నామినేషన్స్ వేయకుండా టీడీపీ గూండాలు అడ్డుకున్నారంటూ జగనే దుష్ప్రచారం చేయించారని మంత్రి నారా లోకేష్ ఆరోపణ సహేతుకంగానే కనిపిస్తోంది కదా?
Jagan హయాంలో Pulivendulaలో అన్ని Wards ఏకగ్రీవం.. అప్పుడు Democracy ఎక్కడుంది?
ఇప్పుడు AP అంతటా Elections జరుగుతుంటే Pulivendulaలోనే ఎందుకు Violence?
మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తప్పదని జగన్ ముందే చెప్పుకున్నారు. అయితే, ఆ నెపాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పైకి…
Suriya's anticipated film Scene directed by Jithu Madhavan is gearing up for a worldwide theatrical…