
ఈ నెల 29వ తేదీన అన్నాడీఎంకే కార్యవర్గ, సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం ద్వారా ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగించాలని పార్టీ నిర్ణయించింది. దీంతో ఈ నెల 29వ తేదీన ఉదయం 9.30 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయని, పురచ్చితలైవి జయలలితకు అచ్చొచ్చిన నగరంలోని ‘శ్రీవారి కల్యాణమండపం’లోనే ఈ సమావేశాలను నిర్వహించనున్నామని జిల్లా కార్యదర్శులు తెలిపారు.
కార్యవర్గంలోని 280 మంది, సర్వసభ్య కార్యవర్గంలోని 2,770 మంది సభ్యులంతా తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆహ్వానం పంపకుండా నేరుగా పిలవాలని పార్టీ ప్రిసీడియం చైర్మన్ ఇ.మధుసూదన్ జిల్లా కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. అదే రోజు చిన్నమ్మను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడంతో పాటు, ఇతర కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ సారి పదవుల్లో చిన్నమ్మ అనుయాయులకు పెద్దపీట వేయనున్నట్టు తెలుస్తోంది.
Ram Charan and his family celebrated Sri Krishna Janmashtami at home. A picture from their…
Toxic has emerged as a big disaster at the box office. The movie had a…