
ఏప్రిల్ 1 నుంచి జరిమానా విధించే పాత పద్ధతిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చేందుకు ఎస్‌బీఐ ప్రయత్నిస్తుండడంతో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై మరోసారి ఆలోచించాలంటూ చేసిన ప్రభుత్వ సూచనపై తమకు సమాచారం లేదని ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ రజనీశ్ కుమార్ తెలపగా, ప్రభుత్వం కోరితే కనుక దీనిని పునరాలోచిస్తామని పేర్కొన్నారు. అలాగే ఏటీఎంల వినియోగంపై స్పష్టత ఇచ్చారు అరుంధతీ.
సాధారణంగా నెలకు నాలుగు సార్లకంటే ఎక్కువగా ఏటీఎంను వినియోగించాల్సిన అవసరం రాదని, ఖాతాదారులు తమ లావాదేవీల కోసం తప్పనిసరిగా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిందేనని, ఈ విషయంలో మొబైల్, ఇంటర్నెట్ వంటి అధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ఓ గృహస్తుడికి నెలకు నాలుగు సార్ల కంటే ఎక్కువగా ఏటీఎంను ఉపయగించాల్సినంత అవసరం ఏముంటుందని, ఇటువంటి అవసరం వ్యాపారులకు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు.
BOTTOM LINE Taapsee Struggles to Salvage a Bland Thriller PLATFORM Netflix RUNTIME 1Hr 56Mins What…
The BCCI is looking at a special ODI series in South Africa before the 2027…