Telugu

వినాయక్ సీనయ్య స్టోరీ అదేనా?

డైరెక్టర్ వి.వి.వినాయక్‌ని హీరోగా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మాణంలో ‘శరభ’ ఫేమ్ ఎన్. నరసింహ దర్శకత్వంలో వస్తున్న సినిమా.. ‘సీనయ్య’ (కంప్లీట్ ఎమోషన్).. నిన్న వినాయక్ పుట్టినరోజు సందర్భంగా.. శుభాకాంక్షలు తెలుపుతూ.. ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రిలీజ్ చేసిన మూవీ టీమ్.. రీసెంట్‌గా ‘సీనయ్య’ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించింది.

ADVERTISEMENT

అయితే ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ వరకు మొదలు కాదట. ఈ సినిమా కోసం వినాయక్ మరికొంత వెయిట్ తగ్గాల్సి ఉందట. దానితో ఇంకొంచెం టైం తీసుకోనున్నారట. ఇది ఇలా ఉండగా ఇది 1980లలో జరిగిన కథ అని తెలుస్తుంది. ఒక మెకానిక్ తన కూతురి మరణానికి ఎలా పగతీర్చుకున్నాడు అనేదే స్టోరీ అని వార్తలు వినిపిస్తున్నాయి.

మధ్యవయస్కుడి పాత్ర కాబట్టి వినాయక్ బానే సరిపోతాడని దిల్ రాజు అభిప్రాయం. 15 ఏళ్ల క్రితం దిల్ సినిమాతో దిల్ రాజుకు వినాయక్ లైఫ్ ఇవ్వగా.. ఇప్పుడు దిల్ రాజు, వినాయక్‌ను హీరోగా పరిచయం చేస్తుండటం గమనించదగ్గ విషయం. మణిశర్మ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవలే ఆయన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ ఆల్బం తో పెద్ద హిట్ ఇచ్చారు.

ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన వినాయక్ కు నటించడం కొత్తేం కాదు. తాను దర్శకత్వం వహించిన ఠాగూర్, ఖైదీ నంబర్.150, అదుర్స్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో ఆయన మెరిశాడు. ఇక ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా రాబోతున్నాడు. మరి ఈ మాస్ డైరక్టర్‌ను నరసింహా ఎలా చూపబోతున్నాడు..? హీరోగా ప్రేక్షకులను వినాయక్ ఏ మేరకు ఆకట్టుకుంటాడో తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Prabhas Takes a Dig at Neel, Gets Salaar 2 Update

Prabhas turned a casual conversation with Prashanth Neel into a fun moment, and fans got…

8 hours ago

Udta Teer Public Talk: Mockery of Dhurandhar Working?

Ayushmann Khurrana and Sara Ali Khan’s Udta Teer has arrived in theatres on October 23,…

8 hours ago