
ఇందులో విశ్వక్ ది ఎంత తప్పుందనేది అతని వైపు నుంచి మొత్తం మాట్లాడాక తేలుతుంది కానీ హీరోల క్రమశిక్షణ గురించి మాత్రం ఇకపై ప్రొడ్యూసర్లు సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇది మొదటిసారి కాదు. 90ల టైంలో తమ్మారెడ్డి భరద్వాజ బాజీగర్ రీమేక్ ని వేటగాడుగా తీస్తున్నప్పుడు రాజశేఖర్ టైంకి రాకుండా తనను అష్టకష్టాలు పెట్టిన వైనాన్ని ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పారు. సరే ఆ టైంలో యాంగ్రీ యంగ్ మ్యాన్ ఫామ్ లో ఉన్నారు, అప్పుడు మీడియా ఇప్పుడంత విస్తృతంగా లేదు కాబట్టి జనానికది అంతగా చేరలేదు. ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. చిరంజీవి ఇటీవలే ఓ సందర్భంలో క్యారవాన్ ల విపరీత వాడకం గురించి చురకలు అంటించడం చూస్తున్నాం.
పట్టుమని పాతిక సినిమాలు పూర్తి కానీ హీరోలు ఇలాంటి అపవాదు మోయాల్సి రావడం ఎంతమాత్రం మంచిది కాదు. ఒదిగి ఉంటేనే ఎదుగుతామనే సూత్రాన్ని ఏదో పెద్దవాళ్ళు చెప్పిన చాదస్తపు మాటగా అనిపించినా సరే ఎప్పటికైనా పాటించే తీరాలి. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తో మొదలుకుని చిరంజీవి బాలకృష్ణ తరం వరకు ఏనాడూ ఇలాంటి వివాదాలు తలెత్తిన సందర్భాలు లేవు. పైగా ఉదయం 7కి షూటింగ్ అంటే ఆరుకే వచ్చేసే డిసిప్లైన్ వీళ్లది. ఓసారి స్టోరీ సిట్టింగ్ కోసం స్వర్గీయ ఎన్టీఆర్ పరుచూరి బ్రదర్స్ ని తెల్లవారుఝామున నాలుగుకి రమ్మన్నారట. నేను పడుకునేదే రాత్రి 2కని గోపాలకృష్ణ వేరొకరితో అంటే అది అనుకోకుండా విన్న ఎన్టీఆర్ సమయం ఆరుకి మార్చారు. గూండా కోసం చిరంజీవి, భైరవ ద్వీపం కోసం బాలకృష్ణలు తీసుకున్న రిస్కుల గురించి కథలుగా చెప్పొచ్చు
ఇదంతా బాగానే ఉంది కానీ మరి హీరోలకు క్రమశిక్షణ ఎలా వస్తుందంటే ఇది ఎవరికి వారు నేర్చుకోవాల్సిందే తప్ప దీనికి ప్రత్యేకంగా స్కూళ్ళు కాలేజీలు ఉండవు. మనం చేస్తున్నది రైటా రాంగా అనేది సెల్ఫ్ రివ్యూ చేసుకోవాలి. లేదంటే నిందలు కాస్తా బండరాళ్లుగా మారి కెరీర్ ని ముంచేసే ప్రమాదం ఉంటుంది. ఇరవై ఏళ్ళ క్రితం విపరీతమైన యాటిట్యూడ్ చూపించిన ఓ కుర్ర హీరో ఇండస్ట్రీ హిట్టు కొట్టిన ఐదేళ్లకే ఆఫర్లు లేక ఇంట్లో కూర్చువాల్సి వచ్చింది. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఇది చాట భారతం అవుతుంది కానీ డిసిప్లిన్ అనేది గాల్లో దీపం కాదు. మన వ్యక్తిత్వమనే చేతులను అడ్డుగా పెడితే దాన్ని ఎవరూ ఆర్పలేరు. మన తర్వాత కూడా గొప్పగా చెప్పుకునే వెలుగుని అది ఇస్తుంది.
Nani and Vijay Deverakonda are moving away from the romantic entertainers and emotional dramas that…
Dharshna Sripal turns up the charm in this glossy, mood fresh gallery that blends soft…