
విడుదలకు ముందు వరకు సీక్రెట్ గా ఉంచిన ఈ విషయంతో, ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేద్దామని భావించిన సల్మాన్ ఖాన్ కు నెటిజన్లు షాక్ ఇచ్చారు. షారుక్ – సల్మాన్ కాంభినేషన్ లో వచ్చిన సన్నివేశం మొత్తం రికార్డ్ చేసి ఆన్ లైన్ లో పోస్ట్ చేయడంతో, అది కాస్త వైరల్ అయ్యింది. ఇంద్రజాలికుడిగా షారూఖ్ నటించగా, సల్లూ భాయ్ అతనిని అనుకరించే ప్రయత్నం చేసే ఈ సన్నివేశం అభిమానులకు కన్నులవిందుగా మారింది.
ఒకప్పుడు స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరు ఖాన్స్ మధ్య తర్వాత విభేదాలు తలెత్తడంతో చాలా ఏళ్ళ పాటు దూరంగా ఉన్నారు. కానీ, సల్మాన్ తన చెల్లెలు అర్పిత పెళ్లికి షారుక్ ను ఆహ్వానించినప్పటి నుంచీ ఇద్దరి మధ్య బంధం మళ్లీ బలపడుతోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి జోడీ సినిమాకు కీలకం కానుందని సల్మాన్ భావించి, సీక్రెట్ గా ఉంచగా, అది కాస్త సోషల్ మీడియాలో లీకై సినీ అభిమానులకు కిక్ ను తగ్గించింది.
Andhra Pradesh's urban local body elections saw a mixed voter response. While some municipalities recorded…
Ram Charan and Sukumar's RC17 has started attracting attention even before the film gets going.…